Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫిక్కీ)తో కలసి 'యాక్సెసింగ్ ఇండిస్టియల్ అండ్ లాజిస్టిక్ సొల్యూషన్స్ టు మాగ్జిమైజ్ యువర్ మార్కెట్ రీచ్' పేరిట ఐదు భాగాల వెబినార్ సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఒమన్ చెందిన సొహర్ పోర్ట్ అండ్ ఫ్రీ జోన్ వెల్లడించింది. మొదటి వెబినార్ జులై 13న జరుగనుందని పేర్కొంది. తమ సంస్థ ద్వారా లభ్యమయ్యే అవకాశాలను ఇందులో వెల్లడించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లోని ఈ అద్భుత మౌలికవసతుల కేంద్రం, వ్యూహాత్మక ప్రాంతం యొక్క ప్రయోజనాలను భారతీయ సంస్థలు పొందవచ్చని పేర్కొంది. జిసిసి, ఆఫ్రికా, యూఎస్‌లలో తమ మార్కెట్ చేరికను గరిష్ఠం చేసుకునేందుకు ఈ వెబినార్ సిరీస్ దోహదం చేయనుందని సొహర్ ఫ్రీజోన్ సిఇఒ ఒమర్ అల్ మహ్రిజి తెలిపారు. ఈ వెబినార్ సిరీస్‌లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు 2021 జులై 12 లోగా ఆన్ లైన్లో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.