Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో ప్రాఫిట్ ట్రక్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర ముంబై ఎక్స్ షోరూంలో మినీ రూ.5.4 లక్షల నుంచి, మ్యాక్సీ రూ.6.22 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. సుప్రో ప్లాట్‌ఫాంపై ఇవి రూపొందాయి. కొనుగోలుదార్లు అయిదేళ్ల కాలపరిమితితో 100 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ‘సామర్థ్యం, ఇంజినీరింగ్ కారణంగా కస్టమర్లు ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనంగా సుప్రోకు ప్రాధాన్యత ఉంది. వినియోగదార్ల లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చాం’ అని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈవో విజయ్ నక్రా తెలిపారు.