Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో #పరివర్తన్ పేరిట నిర్వహించే అన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యతలకు రూ.634.91 కోట్లను ఖర్చు చేసింది. రూ.634.91 కోట్లలో రూ.110 కోట్లను కొవిడ్-19 పరిహార చర్యలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేసింది మరియు వినియోగించింది. అంతే కాకుండా బ్యాంకు తన # పరివర్తన్ కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా రూ.8.5 కోట్లను ప్రజల జీవితాలపై ప్రభావాన్ని చూపించింది.
# పరివర్తన్ ఈ దిగువ పేర్కొన్న వలయాలకు ప్రాధాన్యత ఇచ్చింది:
· గ్రామీణాభివృద్ధి
· విద్యకు ఉత్తేజన
· కౌశల్య శిక్షణ మరియు జీనోపాధి వృద్ధి
· ఆరోగ్య సేవలు మరియు పారిశుద్ధ్యం
· ఆర్థిక సాక్షరత మరియు ఇన్క్లూజన్
సుస్థిరతకు సంబంధించిన కీలక అంశాలు
· గత ఆర్థిక సంవత్సరంలో రూ.634.91 కోట్లను విడుదల చేసిన బ్యాంక్ దేశంలో అత్యంత భారీ స్థాయిలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలకు ఖర్చు చేసిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
· 21 రాష్ట్రాల్లోని 1,970 గ్రామాల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం (HRDP)
· ఉపాధ్యాయులకు శిక్షణ (3T) కార్యక్రమంలో భాగంగా ఎన్జీఓ భాగస్వాముల సహకారంతో బ్యాంకు 19.67 లక్షల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా 2.07 కోట్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది.
· #పరివర్తన్ 28 రాష్ట్రాల్లో 544 జిల్లాల్లో సస్టెనిబిలిటీ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (SLI) రూ.1.29 కోట్ల ఇళ్లకు ప్రయోజనం
· 23,500 పైచిలుకు మరుగుదొడ్ల నిర్మాణం; 1,800+ స్యానిటైజేషన్ కార్యక్రమాలు; 1.18 లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాష్ కార్యక్రమం ద్వారా సంఘటితం చేసింది.
· ఆర్థిక సాక్షతర కార్యక్రమంలో భాగంగా 1.42 కోట్ల లబ్దిదారులు 18.84+ లక్షల ఆర్థిక సాక్షరత శిబిరాల్లో క్రియాశీలకం చేసింది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2023 ఆర్థిక సంవత్సరానికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించే నిర్ణయాన్ని తీసుకుంది, దాని కోసం:
· బ్యాంకు తన ఉద్గారాల సంఖ్యను తక్కువ చేసుకుంటూ, విద్యుత్ మరియు నీటి వినియోగాన్ని తక్కువ చేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది.
· పునర్వినియోగించుకునేందుకు అవకాశం ఉన్న శక్తిని బ్యాంకింగ్ పనుల్లో అలవర్చుకోవడం మరియు విస్తరించడం
· వివిధ వడ్డీ ధరల్లో హరిత ఉత్పత్తులకు రుణాలను ఇచ్చేందుకు ప్రాధాన్యత
· రుణాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే సమయంలో ఇఎస్జి మార్కులను అలవర్చుకోవడం
‘‘ఆసియాలో అత్యంత పెద్ద ప్రైవేటు బ్యాంకుగా మేము పలువురికి అత్యంత కష్టకాలంగా ఉన్న ఏడాదిలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చినందుకు కారణకర్తలుగా ఉన్నందుకు సంతోషిస్తున్నామని’’ హెచ్డిఎఫ్సి బ్యాంకు బిజినెస్ ఫైనాన్స్, స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇఎస్జి అండ్ సిఎస్ఆర్ గ్రూపు హెడ్ ఆశిమా భట్ తెలిపారు. ‘‘హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏదైనా తాత్కాలిక పరిహారం కన్నా, సమస్య మూల కారణాన్ని గుర్తించి, పరిష్కరించే సుస్థిరమైన దీర్ఘావధి చర్యలకు ప్రాధాన్యత ఇచ్చింది. కొవిడ్-19తో పలు రకాల నిర్బంధాలను చూసిన ఒక ఏడాదిలో హెచ్డిఎఫ్సి బ్యాంకు బృందాలు ఎన్జిఓ భాగస్వాములతో కఠిన శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాలు మరియు ప్రాజెక్టుల లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఈ అవకాశాన్ని వారి నిబద్ధతను ప్రశంసించేందుకు నేను వినియోగించుకుంటాను. కొత్త ఆర్థిక సంవత్సరంలో మేము రెట్టించిన ఉత్సాహంలో పని చేయడాన్ని కొనసాగిస్తామని’’ తెలిపారు. బ్యాంకు తన సామాజిక కార్యక్రమాలను యునైటెడ్ నేషన్స్ (UN) సస్టెయినబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ (SDGs)కు అనుగుణంగా ఉన్నాయి. సుస్థిరత మరియు సామాజిక మార్పుల్లో భాగంగా బ్యాంకు చేసి ప్రయత్నాలు ప్రపంచ సంస్థ రూపొందించిన ఎస్డిజిలకు అనుగుణంగా ఉన్నాయి. ఏకీకృత వార్షిక నివేదిక సుస్థిరత అంశం బ్యాంకు చేపట్టిన చర్యలను వివరిస్తుండగా, అది సముదాయాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు, ఆకలిలేని సమాజాన్ని సాధించేందుకు, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించేందుకు, నాణ్యత కలిగిన విద్య మరియు సుస్థిర నగరాలు మరియు సముదాయాలను సృష్టించడం తదితరాలు అందులో భాగంగా ఉన్నాయి.