Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ భారీ మొత్తంలో క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి పైగా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. గతేడాది కూడా ఇంతే స్థాయిలో ఉద్యోగులను తీసుకున్నామని టీసీఎస్ అంతర్జాతీయ మానవవనరుల విభాగం చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో నైపుణ్యాలకు కొదవలేదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నైపుణ్యాలతో కూడిన మానవవనరులు భారత్‌లో ఉన్నాయని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జి సుబ్రహ్మణ్యం తెలిపారు. భారత్ తరహాలోనే అమెరికా, లాటిన్ అమెరికాలోనూ 2000 మందికి పైగా కొత్త వారిని తీసుకోనున్నామన్నారు. గడిచిన జూన్ త్రైమాసికంలో 20,409 మంది ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా మొత్తం సిబ్బంది సంఖ్య 5 లక్షలు దాటిందని టీసీఎస్ వెల్లడించింది.