Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆక్సిజన్ స్థాయిలను పెంచే 2-డీయోక్సీ-డీ-గ్లూకోజ్(2-డీజీ) ఔషదాన్ని ఇకపై ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ కూడా తయారు, మార్కెటింగ్ చేయనున్నది. ఇందుకోసం డీఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), డీఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్‌డీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్) సంస్థలతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషదం కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్‌పై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.