Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్)కు చెందిన ఎస్సెట్ మేనేజర్ నిప్పాన్ లైఫ్ ఇండియా ఎస్సెట్ మేనేజ్మెంట్ కొత్తగా నిప్పాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ పథకమని ఆ సంస్థ తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఒ) 26 జూలై 2021వ తేదీన తెరిచి.. 9 ఆగస్టు 2021వ తేదీన మూసివేయనున్నట్లు పేర్కొంది. కనీస పెట్టుబడిగా 500 రూపాయలు మరియు ఆ పైన 1 రూపాయి గుణిజాలతో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌగట ఛటర్జీ తెలిపారు.