Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దక్షిణాసియా అతిపెద్ద ఆక్వా రైతుల నెట్ వర్క్ అయిన ఆక్వా కనెక్ట్ నేడిక్కడ ప్రి-సిరీస్ A రౌండ్ లో 4 మిలియన్ డాలర్లు (రూ.29.7 కోట్లు) సేకరించింది. ఈ రౌండ్ రిబ్రైట్ పార్ట్ నర్స్, ఫ్లోరిష్ వెంచర్స్ సారథ్యంలో సాగింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఓమ్నివోర్, హెచ్ఏటీసీహెచ్ తో పాటుగా ఏజీ ఫండర్, 6జి క్యాపిటల్ కూడా ఈ రౌండ్ లో పాల్గొన్నాయి.
స్మార్ట్ ఫామ్ మేనేజ్ మెంట్ టూల్స్, ఆర్థిక సేవలు, కొనుగోలుదారులతో అనుసంధానం చేయడం ద్వారా చేపలు, రొయ్యల పెంపకందారులకు వారి ఆదాయాన్ని అధికం చేస్తుంది ఆక్వాకనెక్ట్ యొక్క డిజిటల్ వేదిక. ఆక్వాకనెక్ట్ మొబైల్ యాప్ చెరువు నిర్వహణకు సంబంధించి ప్రిడిక్టివ్ ఎస్ఏఏఎస్ టూల్స్ ను అందిస్తుంది. అ వి ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి మరియు వ్యాధుల ముప్పు నుంచి తప్పించడంలో పెంపకందారులకు తోడ్పడుతాయి. ఆక్వాకనెక్ట్ ఓమ్ని చానల్ మార్కెట్ ప్లే నుంచి పొందే ఫామ్ డేటా ఇంటెలిజెన్స్ ఆక్వా రైతులు నేరుగా ఫామ్ ఇన్ పుట్ తయారీదారులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, సర్టిఫికేషన్ సంస్థలతో లావాదే వీలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది. ఇక చివరిగా ఆక్వాకనెక్ట్ యొక్క పోస్ట్ హార్వెట్ మార్కెట్ లింకేజ్ సొల్యూషన్ అనేది రొయ్యలు, చేపల రైతులు తమ ట్రేసబుల్, సర్టిఫైడ్ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు దారులకు విక్రయించుకోవచ్చు. ఆక్వాకనెక్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ఒడిషా, గుజరాత్, తమిళనాడులలో 30,000 కు పైగా అక్వాకల్చర్ రైతులతో కలసి పని చేస్తోంది. భారతదేశం ప్రపంచపు అతిపెద్ద రొయ్యల ఎగుమతిదారు, ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అయినప్పటికీ అశాస్త్రీయ సాగు విధానాలు మొదలుకొని వాల్యూచెయిన్ లో అసమర్థతల దాకా ఈ పరిశ్రమ వివిధ సమస్యలతో ఉంది. ఆక్వాకనెక్ట్ యొక్క ఫుల్ – స్టాక్ ప్లాట్ ఫామ్ 360 డిగ్రీల పరిష్కారాలను ఆక్వా రైతులకు అందిస్తుంది. ప్రి – సిరీస్ ఎ ఫండిగ్ ను తన జిఐఎస్ ఎనేబుల్డ్ ఫిన్ టెక్ ప్రోడక్ట్ డెవ లప్ మెంట్ కోసం మరియు ఈ వేదిక ద్వారా జరిగే ఎగమతుల పరిమాణం పెంచుకునేందుకు వినియోగించాలని సంస్థ భావిస్తోంది. సిరీస్ ఎ రౌండ్ ను ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ సందర్భంగా ఆక్వాకనెక్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ రాజ్ మాట్లాడుతూ, ‘‘రిబ్రైట్, ఫ్లోరిష్, ఏజీ ఫండర్ వంటి మార్ క్వీ ఇన్వెస్లర్ల తో పాటుగా ఇతరుల ఇటీవలి ఇన్వెస్ట్ మెంట్ భారతదేశాన్ని అతిపెద్ద ఆక్వాకల్చర్ వాల్యూ చెయిన్ అగ్రిగేటర్ గా చేయాలన్న మా ఆశయానికి బలమైన గుర్తింపును. పరిమాణాన్ని, పరిధిని పెంచుకోవడం లో ఇది మాకు తోడ్పడనుంది. మా ఫామ్ అడ్వయిజరీ, ఆర్థిక సేవలు, సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ మార్కెట్ ప్లేస్ ను ఉన్నతీకరించేందుకు తాజా మూలధనాన్ని వినియోగించనున్నాం’’ అని అన్నారు. ఈ పెట్టుబడులపై రిబ్రైట్ పార్ట్ నర్స్ జనరల్ పార్ట్ నర్ బ్రిజ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘జపాన్ వంటి కీలక మార్కెట్లకు భారతదేశ ఆక్వాకల్చర్ పరిశ్రమలో డిజినల్ పరివర్తనను సాధ్యం చేయడంలో సహకరిం చేందుకు మేం ఆక్వాకనెక్ట్ కు అండగా నిలుస్తున్నాం’’ అని అన్నారు.
ఫ్లోరిష్ ఇన్వెస్ట్ మెంట్ డైరెక్టర్ అనురాధ రామచంద్రన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఆక్వాకనెక్ట్ కు అండగా నిలబడుతున్నందుకు మేమెంతగానో గర్విస్తున్నాం. రైతులు తమ ఆదాయాన్ని గరిష్ఠం చేసుకునేందుకు, ఆర్థిక సేవలను యాక్సెస్ చేసేందుకు, కొనుగోలుదారులతో అనుసంధానమయ్యేందుకు తోడ్పడే డేటాను, సాం కేతికతను వినియోగించే వేదికను రాజ్, ఆయన బృందం అభివృద్ధి చేశారు. ప్రసిద్ధ ప్లాట్ ఫామ్ లతో మిళితమై ఉండే ఆర్థిక సేవలు చిన్న వ్యాపారాలకు ఎలా సాధికారికత అందిస్తాయో, యజమానుల జీవనోపాధులను ఎలా పెంచుతాయో అనేందుకు ఆక్వాకనెక్ట్ ఒక చక్కటి ఉదాహరణ. ఫ్లోరిష్ అనుసరించే ఇన్వెస్ట్ మెంట్ సూత్రాలను ఇది నిదర్శనం’’ అని అన్నారు.
చెన్నైకి చెందిన ఆక్వాకనెక్ట్ 2017లో రాజమనోహర్ ‘‘రాజ్’’ సోమసుందరం చే నెలకొల్పబడింది. ఆయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. ఆక్వాకనెక్ట్ ప్రారంభించేందుకు ముందు ఆయన హెక్సో ల్యాబ్స్ నెలకొల్పారు. అది మొబైల్ వీఏఎస్ కంపెనీ. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలో 15 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించింది. మొబైల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ రంగాల్లో ఆయన అందించిన సేవలు, నాయకత్వానికి గాను వరల్డ్ ఎక నామిక్ ఫోరమ్ ఆయనను ‘యంగ్ గ్లోబల్ లీడర్స్ 2012’గా పేర్కొంది. వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ‘మొబైల్ 4 గుడ్’ ఇన్షియేటివ్ లకు గాను ఆయన 2009లో ‘టెడ్ ఫెలో’ కూడా అయ్యారు.
ఆక్వాకనెక్ట్ నాయకత్వ జట్టులో కన్జ్యూమర్ ఇంటర్నెట్, బీఎఫ్ఎస్ఐ, డేటా సైన్స్ నేపథ్యాలకు చెందిన పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. చీఫ్ గ్రోత్ ఆఫీసర్ అర్పన్ భలేరావ్, ఐఐటి మద్రాస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థి. గతంలో ఆయన అర్బన్ కంపెనీలో ఏవీపీగా పని చేశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కార్తివేలన్ సీజన్డ్ బ్యాంకర్. వెంకటేశన్ ఓవీ ఎంఐటి. టెక్ రివ్యూ గుర్తింపు పొందిన డేటా సైంటిస్ట్. టెక్నాలజీ, డేటా సైన్సెస్ జట్లకు సారథ్యం వహిస్తారు. చివరిగా, అమిత్ సాలుంకే క్రోపిన్ లో బీఎఫ్ఎస్ మాజీ హెడ్, సుధీర్ సిలావల్ గతంలో ఫామ్ గైడ్ తో పని చేశారు. వీరిద్దరూ ఫిన్ టెక్, జీఐఎస్ లకు సారథ్యం వహిస్తున్నారు.