Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో లీడింగ్ కంటెంట్ ఆపరేటర్ మరియు పే టీవీ ప్లాట్ఫామ్లో అగ్రగామిగా దూసుకుపోతోంది టాటా స్కై. అలాగే లైవ్ ఆన్లైన్ లెర్నింగ్‌లో అగ్రగామిగా దూసుకుపోతోంది వేదాంతు. ఇప్పుడు ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అత్యుత్తమ మరియు నాణ్యమైన విద్యను అందించేందుకు కోసం భాగస్వామ్యమయ్యాయి.
టాటా స్కై జేఈఈ ప్రిపరేషన్ మరియు టాటా స్కై నీట్ ప్రిపరేషన్ ఇప్పుడు విద్యార్థులకు చాలా అవసరం. అందుకే వేదాంతుతో అసోసియేట్ అయ్యింది. దీనిద్వారా ఈ రెంటికి ఉన్న వ్యయం, దూరం లాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేస్తోంది. దీనిద్వారా ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి 9, 10 తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ ప్రిపరేషన్ (ఐఐటీ, నీట్, ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్స్), 11, 12 తరగతి విద్యార్థులకు ఐఐటీ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ (ఇంజినీరింగ్), నీట్ (మెడికల్) ప్రిపరేషన్‌ను కావాల్సిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అది కూడా కేవలం రోజుకి రూ.5లకు మాత్రమే. వేదాంతుకు చెందిన మాస్టర్ టీచర్స్, టీచింగ్‌లో అద్భుతమైగ రికార్డులు కలిగినటువంటి ఐఐటీ, ఎయిమ్స్ అకడమిక్స్ బోధిస్తారు. ఈ బోధన ఇంగ్లిష్, హిందీ భాషల మిశ్రమంగా ఉంటుంది.
కంటెంట్‌ను సులభంగా పొందేందుకు టాటా స్కై మొబైల్ యాప్‌లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమమయ్యే విద్యార్థులు ఈ బోధనలు విని నేర్చుకోవచ్చు మరియు రిపీట్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు సిలబస్ రివిజన్, పరీక్షలు, క్లాస్ నోట్స్‌తో సహా అన్నీ ఉంటాయి. విద్యార్థులు వారికి ఏవైనా అనుమానాలు ఉన్నా ప్రశ్నలు వేయవచ్చు. దానికి సంబంధించిన సమాధానాన్ని వేదాంతుకు చెందిన నిపుణులైన మాస్టర్ టీచర్స్ అందిస్తారు. యాప్ ద్వారా ఎగ్జామ్ ప్రిపరేషన్ మెటీరియల్‌ను అందిస్తారు. టాటా స్కై, వేదాంతు భాగస్వామ్యంతో మరొ అదనపు ప్రయోజనంతో కూడా ఉంది. టాటా స్కై చందాదారులు వేదాంతు లైవ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు. వీటిలో గ్రేడ్ 12 & ఇతర పోటీ పరీక్షలు, సిబిఎస్ఇ / ఐసిఎస్ఇ / స్టేట్ బోర్డ్ తరగతులు మరియు మరెన్నో కోర్సులు ఉన్నాయి. ఈ ఆఫర్ ద్వారా చందాదారులు లైవ్ క్లాసులు, పాఠ్యాంశాలు, కోర్సు రివిజన్ మెటీరియల్ మొదలైన వాటిని యాక్సెస్ చేయగలరు.
ఈ సందర్భంగా టాటా స్కై చీఫ్ కమర్షియల్ & కంటెంట్ ఆఫీసర్ పల్లవి పూరీ మాట్లాడుతూ, “టీవీకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను చేరే సామర్థ్యం ఉంది. టీవీ ద్వారా నాణ్యమైన విద్యను అందించడం వల్ల గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎదుర్కొంటున్న బ్రాడ్‌బ్యాండ్ సమస్యని కూడా టీవీతో భర్తీ చేసుకోవచ్చు. “పోటీ పరీక్షలకు ఒక నిర్దిష్టమైన విధానం చాలా అవసరం. ఇప్పుడు మేము వేదాంతుతో కలిసి మేము వివిధ రకాల నేపథ్యాలు, సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల కోసం కోర్సు సామగ్రి, వనరులు, నాణ్యమైన బోధనను అందిస్తున్నాము. దీనిద్వారా ఉన్నత విద్య పొందాలనే విద్యార్థులకు దాన్ని చాలా దగ్గరకు తీసుకొచ్చిన వారమవుతాం ”అని అన్నారు ఆమె.
ఈ సందర్భంగా వేదాంతు COO అరవింద్ సింఘాల్ మాట్లాడుతూ, “K-12 మొత్తం 30 మిలియన్ల మంది విద్యార్థులు, పరీక్ష తయారీ విభాగాల ద్వారా ప్రతి నెలా వేదాంతు లైవ్ లెర్నింగ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. మా అత్యంత శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా క్యూరేటెడ్ తరగతులను ఔత్సాహిక ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు వారి విద్యార్థులు వారి టీవీ స్క్రీన్ల నుండి నేర్చుకునేందుకు టాటా స్కైతో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ప్రతి ఇంటికి సరసమైన ధరలకు నాణ్యమైన విద్యను తీసుకెళ్లాలనే మా లక్ష్యంలో #hargharVedantu! మరొక మెట్టు” అని అన్నారు.
విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన అభ్యాసాన్ని అందించడంతో పాటు ఇంటరాక్టివ్ క్విజ్ పోటీలను కూడా నిర్వహిస్తారు. వీటిని విద్యార్థులు తమ టీవీ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండు సర్వీసులు ప్రధానంగా ప్రిపరేషన్ ఫౌండేషన్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తరగతి విద్యార్థులకు కోర్ పాఠాలపై దృష్టి సారించనున్నాయి. 9 వ తరగతి -10 వ తరగతి కోసం టెస్ట్ ప్రిపరేషన్ ఫౌండేషన్ పాఠాలు 440+ వీడియోలలో ఉన్నాయి. ఇక 11 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు, పాఠ్యప్రణాళికలో జూలై 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు దాదాపు 2100+ వీడియోలు ఉన్నాయి. ఇందులో జనవరి 2022 నుండి ప్రారంభమయ్యే సమగ్ర రివిజన్ సెషన్ కూడా ఉంటుంది. ఇది క్లాస్ నోట్స్, ప్రిపరేషన్ మెటీరియల్ మరియు టెస్ట్ సిరీస్‌లతో వేదాంతు అధ్యయన కేంద్రాన్ని కలిగి ఉంది. వీటిని టాటా స్కై మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. టాటా స్కై జేఈఈ ప్రిపరేషన్, టాటా స్కై నీట్ ప్రిపరేషన్ ద్వారా అందరికీ సమానమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే 518 నెంబరుపై టాటా స్కై నీట్ యాక్సెస్ పొందటానికి చందాదారులు 8891088910 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు మరియు 84600484604 లో మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా 517 నెంబరులో టాటా స్కై జేఈఈ ప్రిపరేషన్ కు యాక్సెస్ పొందవచ్చు.