Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టైటానియం, టైటానియం+ ట్రిమ్స్‌లో ప్రారంభిక ధరలు వరుసగా రూ.7.75 లక్షలు,రూ. 8.20 లక్షలు ఉన్నాయి మరియు కొత్త ఫిగో ఎటి ఈ శ్రేణిలో అత్యుత్తమ సిక్స్-స్పీడ్, టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ భారత్ స్టేజ్ 6 త్రీ-సిలిండర్ 1.2 లీ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. కొత్త వేరియెంట్లు మహోన్నతంగా నగదుకు తగిన విలువ కలిగి ఉండగా, కాంప్యాక్ట్ కారు శ్రేణిలో పనితీరులో నాయకుడు కాగా, 96పిఎస్ శక్తి, 119 ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తుంది. ‘‘ఫోర్డ్ భారతదేశంలో వినియోగదారులకు సేవను అందించేందుకు కట్టుబడి ఉంది. గ్రూపు మార్కెట్ శ్రేణిలో వినియోగదారునికి ప్రపంచ స్థాయి ఆటోమేటిక్ సాంకేతికతను పరిచయం చేసేందుకు గర్వపడుతున్నామని’’ ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ‘‘అసాధారణ పనితీరు, సరిసాటిలేని సురక్షత, ఉన్నత సాంకేతికత మరియు శ్రేణిలో ప్రథమ కనెక్టివిటీ ఇప్పటినే తనను తాను రుజువు చేసుకున్న పరంపరతో మేము నూతన ఫిగో ఎటియు ఎఎంటి వంటి ఒకే తరహాలో కనిపించే ఆటోమేటిక్‌లో నమ్మకం లేనివారు, కొత్త కొనుగోలుదారులకు సహజ ఎంపికగా ఉంటుంది’’ అని వివరించారు.
ఫోర్డ్ ఫిగో ఎటి ఉన్నత పనితీరు, పరిష్కరణ మరియు డ్రైవబిలిటీల పరిపూర్ణ సంయోజనకాగా, కొత్త స్పోర్ట్ మోడ్, సెలెక్ట్ షిఫ్ట్ ప్రత్యేకతలు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఉన్నాయి.
ఎక్కువ ఎంపికలు, వృద్ధి చేసిన విలువను అందించేందుకు ఫిగో ఎటి ఈ వాహన పరిశ్రమలో పలు ప్రథమ ప్రత్యేకతలను అందిస్తోంది. వాటిలో:
· రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఎక్కువ అనుకూలతకు ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్విఎం
· ఉన్నత కనెక్టివిటీకి 7’’ కెపాసిటేటివ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం
· సైడ్& కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, స్టాండర్డ్ డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ లాంచ్ అసిస్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నత సురక్షతకు అనుగుణంగా ఉన్నాయి. డైమండ్ వైట్, రూబీ రెడ్, మూన్డస్ట్ సిల్వర్, స్మోకీ గ్రే మరియు వైట్ గోల్డ్‌లతో కలిపి 5 వర్ణాల్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న మొబిలిటీ మరియు కనెక్టివిటీ పరిష్కరణ ఫోర్డ్‌పాస్TMను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది. ఫోర్డ్ ఫిగో ఎటి యజమానులు స్టార్టింగ్, స్టాపింగ్ లేదా వాహనాన్ని దూరం నుంచే అన్లాకింగ్ చేయడంతో పాటు పలు రకాల వాహన పనులను ఫోర్డ్‌పాస్TM యాప్ ద్వారా అందిస్తుంది. ఫోర్డ్ పిగో 3 ఏళ్లు లుదా 100,000 కి.మీ. స్టాండర్డ్ వారెంటీ, 10,000 కి.మీ. దీర్ఘావధి సేవా అంతరాల ద్వారా యాజమాన్యపు విలువలో మైలురాయిని కలిగి ఉండగా, పోటీ మోడళ్లు 5,000 కి.మీ. అందిస్తుంది.
ఫోర్డ్ ఫిగో యజమానులు మొదటి ఏడాది షెడ్యూల్డ్ సర్వీస్‌కు రూ.1,313 మేర తక్కువ ఖర్చు వస్తుంది లేదా 10-ఏళ్ల సేవను ఆశ్చర్యకరమైన అందుబాటు ధర, కేవలం రూ.4,907లో అందిస్తుంది. ప్రస్తుతం మహమ్మారి నేపథ్యంలో వినియోగదారులు ఆరోగ్యం మరియు అనుకూలతకు ప్రాధాన్యత ఇచ్చే కంపెనీ నూతన ఫిగో ఎటిను ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ www.booking.india.ford.com ద్వారా బుకింగ్‌లను అందుకుంటుంది. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ కొనుగోలుదారులకు వారి నూతన ఫిగో ఎటిను తమ ఇళ్ల అనుకూలతలోనే ఎంపిక, బుకింగ్ మరియు ఇంటి వాకిలి వద్దే వాహనాన్ని అందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. వినియోగదారులు తమ కొత్త ఫోర్డ్ కార్లను బుకింగ్ చేసుకునే సమయంలో బుకింగ్ భాగస్వాముల ద్వారా రియల్-టైమ్ అసిస్టెన్స్‌ను ఆన్లైన్లో పొందుతారు. ఇది ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. కంపెనీ కొత్త బుకింగ్ పోర్టల్ ఇటీవల ప్రకటించిన డయల్-ఎ-ఫోర్డ్ కార్యక్రమానికి విస్తరణ కాగా, అది వినియోగదారులకు టోల్-ఫ్రీ సంఖ్య 1800-419-3000 ద్వారా మీరు పలు సేవలను అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.