Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20,000 మంది ఉద్యోగస్తులకు వ్యాక్సిన్
హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలమైన ఇండస్ట్రీని ఆదుకునేందుకు రైజింగ్ ద బార్ అనే కార్యక్రమాన్ని గతంలోనే ప్రారంభించింది డియాజియో ఇండియా. ఇప్పుడు ఈ కార్యక్రమం కింద రిజిస్టర్ చేయబడిన ఎఫ్ అండ్ బి ట్రేడ్ పార్టనర్లకు వ్యాక్సిన్ వేసేందుకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఐఐ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది డియాజియో ఇండియా. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మంది ఉద్యోగులకు వ్యాక్సిన్ రెండు డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది డియాజియో ఇండియా.
మహమ్మారి వల్ల గతేడాది నుంచి ఎఫ్ అండ్ బి పరిశ్రమ లాక్డౌన్లతో సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయి. దాని ప్రభావం ఉద్యోగస్తులపై కూడా పడింది. ప్రస్తుతం పరిస్థితులు కొంచెం చక్కబడడంతో.. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగస్తులు భద్రత చాలా ముఖ్యం. అందుకే దేశంలో బార్లు, పబ్బులు మరియు అల్కాహల్ అందించే రెస్టారెంట్లకు సహాయం చేసేందుకు డియాజియో ఇండియా ముందుకు వచ్చింది.
ఈ కార్యక్రమం జూన్ 2021లోనే మొదలైంది. అప్పటినుంచి రైజింగ్ ది బార్ ప్రోగ్రాం కింద రిజిస్టర్ చేసుకున్న NRAIతో భాగస్వామ్యం కలిగిఉన్న 1500 ఔట్లెట్ల ఉద్యోగులకు, ఎంపిక చేసిన ఆసుపత్రులలో వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, కోల్కతా , బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే మరియు గోవా నగరాల్లోని ఉద్యోగస్తులు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గురించి డియాజియో ఇండియా (వైస్ ప్రెసిడెంట్ లగ్జరీ కమర్షియల్, కీ అకౌంట్స్ ఇండియా & సౌత్ ఆసియా) శ్వేతా జైన్ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ... ఈ మహమ్మారి సమయంలో రైజింగ్ ద బార్ మరియు వరల్డ్ క్లాస్ లాంటి కార్యక్రమాల ద్వారా బార్ అండ్ హాస్పిటాలిటీ రంగాలకు మద్దతు తెలిపేవారిలో అందరికంటే ముందు ఉంది డియాజియో ఇండియా. ఈ రంగం తిరిగి పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. భారతదేశంలో ఎఫ్ అండ్ బి ఇండస్ట్రీ ఆపరేషన్స్ తిరిగి మొదలైనప్పుడు ఉద్యోగులు మరియు వినియోగదారుల విశ్వాసాన్ని పొందడం చాలా అవసరం. అదే సమయంలో... వారు ఎంతగానో ఇష్టపడే ప్రదేశాలకు ఎలాంటి ఇబ్బంది, భయం లేకుండా తీసుకురాగలగడం కూడా అంతే అవసరం అని అన్నారు. రైజింగ్ ద బార్ కార్యక్రమాన్ని జూన్ 2020లో ప్రారంభించారు. అప్పుడు దీనికోసం రూ.75 కోట్లను వెచ్చించారు. ఈ మొత్తాన్ని రివైవర్ మరియు రికవరీ కార్యక్రమం మహమ్మారి కింద కుదేలైన పబ్స్, బార్లు మరియు రెస్టారెంట్లను ఆదుకునేందుకు కేటాయించారు. దీనిద్వారా వ్యాపారాలు తిరిగి కోలుకునేందుకు, అలాగే వినియోగదారులను తిరిగి స్వాగతించడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా, రెస్టారెంట్ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ల ఖర్చులను భరించడం ద్వారా మహమ్మారి సమయంలో ఎఫ్ అండ్ బి పరిశ్రమకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు డియాజియో ఇండియా మరియు ఎన్ఆర్ఐఐ ఎప్పుడూ ముందు ఉంటాయని మరోసారి నిరూపితం అయ్యింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గురించి NRAI అధ్యక్షుడు, ఇండిగో హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ కత్రియర్ మాట్లాడుతూ... 'ఈ క్లిష్ట సమయాల్లో మా పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన డియాజియో ఇండియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇండస్ట్రీ మరియు వారి ఛానల్ పార్ట్నర్స్ సంయుక్తంగా ఇలాంటి భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ కార్యక్రమం ఎఫ్ అండ్ బి ఫ్రాటెర్నిటీ మరియు డియాజియో ఇండియా మధ్య సంబంధాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. అంతేకాకుండా ఎన్ఆర్ఐఐ టీకా డ్రైవ్ మా రెస్టారెంట్ల సిబ్బంది వారి పనిని త్వరగా తిరిగి ప్రారంభించేలా చేస్తుంది. అన్నింటికి మించి మా అతిథులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. డియాజియో ఇండియా చేసిన ప్రయత్నాలను నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎఫ్ అండ్ బి పర్యావరణ వ్యవస్థలోని ఇతర ప్రధాన వాటాదారులు ఈ అద్భుతమైన చర్యలను అనుసరిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను' అని అన్నారు.