Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐవిఎఫ్ తదితర ఫెర్టిలిటీ చికిత్సల గురించి జాగతి కల్పించేందుకు సంతానోత్పత్తి చికిత్సలు అందిస్తున్న ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్ తన #అన్కాంప్లికేట్ క్యాంపెయిన్ కోసం లూయిస్ బ్రౌన్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదర్చుకున్నామని విలేకరుల సమావేశంలో నేడు ప్రకటించింది. రానున్న మూడేళ్లకు పైగా కొనసాగనున్న ఈ భాగస్వామ్యంలో బ్రౌన్ దేశవ్యాప్తంగా బ్రాండ్ గురించి అవగాహన కల్పించడంలో ఒక భాగం అవుతారు. ఈ సమావేశంలో ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్‌లు భారతదేశపు ఫెర్టిలిటీ వలయపు ప్రగతి సామర్థ్యాన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేయడంతో పాటు, ఈ వలయం 2026 నాటికి 75% వృద్ధితో 1.45 బిలియన్ డాలర్ల వ్యాపారానికి చేరుకుంటుందని చర్చించారు. సంతానోత్పత్తికి 25 నుంచి 49 ఏళ్ల వయస్సులో ఉన్న 247 మిలియన్ మహిళల్లో 30 మిలియన్ దంపతులు సూక్ష్మ-సంతానలేమి లేదా జీవితకాలపు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఊబకాయం, చురుకుదనం లేని జీవనశైలి, గర్భనిరోధక సాధనాలను ఎక్కువగా వినియోగించడం, లైంగిక క్రియతో వచ్చే రోగాలు ఇవన్నీ స్త్రీ, పురుషుల్లో సంతానలేమి సమస్యను తీవ్రం చేసేందుకు కారణమవుతాయి. దేశంలో 1,750 ఐవిఎఫ్ కేంద్రాలు (చైనా అనంతరం రెండవ అతి ఎక్కువ సంఖ్య) ప్రస్తుత ఏడాదికి 2,50,000 ఆవర్తనాలతో అన్ని సంస్థల మధ్య గర్భధారణలో క్లినికల్ రీసర్చ్‌లో భారతదేశం నాయకత్వ స్థానాన్ని పొందే అపార సామర్థ్యం కలిగి ఉన్న అత్యంత తక్కువ విస్తరణ కలిగిన మార్కెట్‌గా ఉంది. ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా సిఇఓ వివేక్ గదియా మాట్లాడుతూ ‘‘మా #అన్కాంప్లికేట్ క్యాంపెయిన్ కోసం బ్రాండ్ ప్రచారకర్తగా లూయిస్ బ్రౌన్ వచ్చి చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఐవిఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) విజయానికి మొదటి రుజువు మరియు వారి ధ్వని అలాగే వారి కథ ఐవిఎఫ్ చుట్టూ ఉన్న అపోహలను తొలగించడంలో అలాగే జాగృతి కల్పించడంలో కీలకం కానుంది. ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్‌లో మేము సూక్ష్మ సంతానలేమి మరియు/లేదా సంతానలేమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దంపతులు వారు తల్లిదండ్రులుగా మారే ప్రయాణంలో కారుణ్యపూరిత చికిత్సలతో అవసరమైన ఉత్తమ చికిత్సలను అందించడం ద్వారా అంతరాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. ఐవిఎఫ్ వ్యాపారంలో భాగంగా మేము ఈ క్యాంపెయిన్‌ను ఐవిఎఫ్ చికిత్సల గురించి జాగృతిని వృద్ధి చేసేందుకు మరియు లభించేలా చేయాలని కోరుకునే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము మరియు చికిత్సలు అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. చికిత్సలను నియంత్రించే అలానే ప్రభుత్వ సంస్థలకు సంతానలేమిని మధుమేహం, హృద్రోగం తదితర రోగాల జాబితాలోకి చేర్చాలని కోరుతున్నామని’’ వివరించారు. ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా డిజిగ్నేటెడ్ ఇండియా మెడికల్ డైరెక్టర్ డా.గురుప్రీత్ సింగ్ కాల్రా మాట్లాడుతూ ‘‘సహజంగా గర్భధారణ సాధ్యం కాక, సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు మహిళలకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) భరోసాకు సంకేతంగా ఉంది. ఈ సాంకేతికత ఆవిష్కరణ ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్కరణగా నిలువగా, సంతాన లేమి సమస్య ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ అనుకూలతను తీసుకు వచ్చింది. మేము ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్‌లో మా అన్ని రోగులకు రుజువుల ఆధారిత చికిత్స మరియు పర్సనలైజ్ చేసిన చికిత్స పథకాలను అందిస్తున్నాము. ఎఆర్టి క్లినిక్స్‌లో చికిత్స పథకాలను తన ప్రొప్రైటరీ రీసర్చ్ ఆధారంగా పర్సనలైజ్ చేయగా, అది తెగలు, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలు మరియు గత వైద్య చరిత్ర ఆధారంగా అందిస్తోంది. ఈ సమస్య విధానం సైన్సు, ప్రకృతి మరియు జనాభా అంశాల సంయోజనతో రూపొందగా, ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా 69% మేర ఎక్కువ క్లినికల్ గర్భధారణ సాధించేందుకు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్‌లు భారతదేశంలో ఐవిఎఫ్ సాంకేతికత వలయాన్ని అత్యంత కఠిన ఐవిఎఫ్ ప్రోటోకాల్స్ (యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ)ను తన అన్ని కేంద్రాల్లో జారీ చేస్తోంది. బ్రాండ్ ప్రచారకర్త లూయిన్ బ్రౌన్ మాట్లాడుతూ ‘‘ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఐవిఎఫ్ గురించి మన నమ్మకాలతో ముడిపడి ఉన్న విజ్ఞాన ప్రకృతికి మద్ధతు ఇచ్చే విశ్వాసం లాంటిది. ఫెర్టిలిటీ చికిత్సలను పరిగణనలోకి తీసుకునే దంపతులకు వివరాలు అందజేయడం మరియు ఉత్తేజించడం నా జీవితాశయాల్లో ఒకటి కాగా, ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్‌ల ద్వారా దాన్ని భారతదేశంలో చేస్తున్నానన్న భరోసా కలిగి ఉన్నాను’’ అని తెలిపారు. ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా ఐవిఎఫ్‌ను సంతానలేమికి వైద్య చికిత్సల జోక్యంగా జాగృతిని కల్పించే ప్రయాణాన్ని ప్రారంభించింది. తన#అన్‌కాంప్లికేటెడ్ అభియాన్ భారతీయుల్లో ఉన్న మొహవాటాన్ని మరియు సందేహాలను నివారించే మరియు చికిత్స చుట్టూ ఉనన అపోహలను నియంత్రించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఎఆర్టి ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా పర్సనలైజ్ చేసిన (స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్) చికిత్సతో పాటు, రోగ పరీక్ష మరియు పురుషులు అలాగే మహిళల సంతానలేమికి చికిత్స అందించే సమగ్ర శ్రేణి సేవలను అందించేందుకు కట్టుబడి ఉంది.