Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· పీజీ స్థాయి వరకు 3,200 మంది విద్యార్థులకు మద్ధతుగా రూ.9 కోట్లతో నిధి
· రూ.75,000 వరకు ఒన్-టైమ్ స్కాలర్షిప్
హైదరాబాద్: కొవిడ్-19 బాధిత విద్యార్థులకు కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్లను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా, తన పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రకటించింది. ఈ స్కాలర్పిష్ కార్యక్రమం పాఠశాల విద్యార్థులు మరియు అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు మరియు డిప్లమో కోర్సుల విద్యార్థుల కోసం రూపొందించింది. ఈ స్కాలర్షిప్ పథకంలో భాగంగా విద్యార్థులకు రూ.15,000 నుంచి రూ.75,000 వరకు ఒకసారి ఏకమొత్తంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
వీరికి మాత్రమే
1) తల్లి లేదా త్రండి లేదా ఇద్దరినీ కోల్పోయిన వారు
2) మహమ్మారి సందర్భంలో ఉద్యోగం (లేదా జీవనోపాధి) కోల్పోయిన వారు, కుటుంబం కోసం సంపాదిస్తున్న సభ్యుడు (లు)
బ్యాంకు పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్కు రూ.9 కోట్లతో నిధిని ఏర్పాటు చేసింది. పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ 3,200 మంది విద్యార్థులకు ఈ రెండు విభాగాల్లో మద్ధతు అందించనుంది:
· పాఠశాల (1 నుంచి 12వ తరగతి) స్థాయికి చెందిన 1,800 మంది విద్యార్థులు
· కళాశాల (డిప్లమో, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు) స్థాయికి చెందిన 1,400 మంది విద్యార్థులు
బిజినెస్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ మాట్లాడుతూ ‘‘విద్యార్థులు మన దేశ భవిష్యత్తు మరియు వారి విద్య ముఖ్యమైనది. ఈ మహమ్మారి దేశ వ్యాప్తంగా పలు కుటంబాలపై దుష్ర్పభావాన్ని చూపించింది మరియు పలువురు విద్యార్థుల విద్యాభ్యాసాన్ని డోలాయనమాన స్థితికి తీసుకు వెళ్లింది. సమస్యలతో కూడుకున్న ఈ సమయంలో మేము మహమ్మారితో కష్టాల బారిన పడిన మరియు పాఠశాలలు లేదా కళాశాల్లో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలి పెడుతున్న ప్రతిభావంత విద్యార్థులకు మద్ధతు ఇవ్వడంపై విశ్వాసాన్ని ఉంచాము. సామాజిక బాధ్యత కలిగిన కార్పొరేట్ పౌరులుగా మేము సాధ్యమైనన్ని రకాలుగా మద్ధతు ఇస్తున్నాము. కనుక, మేము కొవిడ్‌తో బాధితులుగా మారిన విద్యార్థులకు అదనపు స్కాలర్షిప్లను అందుబాటులోకి తీసుకువచ్చాము’’ అని వివరించారు. ఏడాదికి 6 లక్షల కన్నా తక్కువ కుటుంబ ఆదాయాన్ని కలిగి ఉన్న విద్యార్థులు మరియు భారతీయ విద్యా మండలి మరియు విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ మహమ్మారితో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచి పెడుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ స్కాలర్షిప్ కార్యక్రమం బడ్డి4స్టడీ ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తుండగా, ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద స్కాలర్షిప్ ప్లాట్‌ఫారాన్ని నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ దిగువ ఉన్న లింక్ ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-covid-crisis-support-scholarship-program
ఇది బ్యాంకు నిర్వహిస్తున్న రెండవ స్కాలర్షిప్ కార్యక్రమంగా ఉంది. ఇందులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఏటా నిర్వహించే అగ్రగామి ఎడ్యుకేషనల్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ (ECSS)కూడా ఉంది. బడ్డి4స్టడీ ఎడ్యుకేషనల్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ (ECSS) కూడా నిర్వహిస్తుండగా, అది మార్చి 2021లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. జూన్ 2021 వరకు ఇసిఎస్ఎస్ అన్ని విభాగాల్లో 63,000 దరఖాస్తులను స్వీకరించింది మరియు 3,100 ప్లాన్డ్ స్కాలర్‌షిప్‌లలో 800లను ఇప్పటికే వితరణ చేసింది. ఈ ప్రవర్తన నేపథ్యంలో బ్యాంకు కొత్తగా విడుదల చేసిన పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్కు 60,000కు పైగా ఎక్కువ దరఖాస్తులను నిరీక్షిస్తోంది. కొవిడ్-19 బాధిత విద్యార్థులకు కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్లను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా, తన పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రకటించింది. ఈ స్కాలర్పిష్ కార్యక్రమం పాఠశాల విద్యార్థులు మరియు అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు మరియు డిప్లమో కోర్సుల విద్యార్థుల కోసం రూపొందించింది. ఈ స్కాలర్షిప్ పథకంలో భాగంగా విద్యార్థులకు రూ.15,000 నుంచి రూ.75,000 వరకు ఒకసారి ఏకమొత్తంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
వీరికి వర్తిస్తుంది:
1) తల్లి లేదా త్రండి లేదా ఇద్దరినీ కోల్పోయిన వారు
2) మహమ్మారి సందర్భంలో ఉద్యోగం (లేదా జీవనోపాధి) కోల్పోయిన వారు, కుటుంబం కోసం సంపాదిస్తున్న సభ్యుడు (లు)
బ్యాంకు పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్కు రూ.9 కోట్లతో నిధిని ఏర్పాటు చేసింది. పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ 3,200 మంది విద్యార్థులకు ఈ రెండు విభాగాల్లో మద్ధతు అందించనుంది:
· పాఠశాల (1 నుంచి 12వ తరగతి) స్థాయికి చెందిన 1,800 మంది విద్యార్థులు
· కళాశాల (డిప్లమో, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు) స్థాయికి చెందిన 1,400 మంది విద్యార్థులు
బిజినెస్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ మాట్లాడుతూ ‘‘విద్యార్థులు మన దేశ భవిష్యత్తు మరియు వారి విద్య ముఖ్యమైనది. ఈ మహమ్మారి దేశ వ్యాప్తంగా పలు కుటంబాలపై దుష్ర్పభావాన్ని చూపించింది మరియు పలువురు విద్యార్థుల విద్యాభ్యాసాన్ని డోలాయనమాన స్థితికి తీసుకు వెళ్లింది. సమస్యలతో కూడుకున్న ఈ సమయంలో మేము మహమ్మారితో కష్టాల బారిన పడిన మరియు పాఠశాలలు లేదా కళాశాల్లో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలి పెడుతున్న ప్రతిభావంత విద్యార్థులకు మద్ధతు ఇవ్వడంపై విశ్వాసాన్ని ఉంచాము. సామాజిక బాధ్యత కలిగిన కార్పొరేట్ పౌరులుగా మేము సాధ్యమైనన్ని రకాలుగా మద్ధతు ఇస్తున్నాము. కనుక, మేము కొవిడ్‌తో బాధితులుగా మారిన విద్యార్థులకు అదనపు స్కాలర్షిప్లను అందుబాటులోకి తీసుకువచ్చాము’’ అని వివరించారు.
ఏడాదికి 6 లక్షల కన్నా తక్కువ కుటుంబ ఆదాయాన్ని కలిగి ఉన్న విద్యార్థులు మరియు భారతీయ విద్యా మండలి మరియు విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ మహమ్మారితో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచి పెడుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ స్కాలర్షిప్ కార్యక్రమం బడ్డి4స్టడీ ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తుండగా, ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద స్కాలర్షిప్ ప్లాట్‌ఫారాన్ని నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ దిగువ ఉన్న లింక్ ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-covid-crisis-support-scholarship-program
ఇది బ్యాంకు నిర్వహిస్తున్న రెండవ స్కాలర్షిప్ కార్యక్రమంగా ఉంది. ఇందులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఏటా నిర్వహించే అగ్రగామి ఎడ్యుకేషనల్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ (ECSS)కూడా ఉంది. బడ్డి 4 స్టడీ ఎడ్యుకేషనల్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ (ECSS) కూడా నిర్వహిస్తుండగా, అది మార్చి 2021లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. జూన్ 2021 వరకు ఇసిఎస్ఎస్ అన్ని విభాగాల్లో 63,000 దరఖాస్తులను స్వీకరించింది మరియు 3,100 ప్లాన్డ్ స్కాలర్‌షిప్‌లలో 800లను ఇప్పటికే వితరణ చేసింది. ఈ ప్రవర్తన నేపథ్యంలో బ్యాంకు కొత్తగా విడుదల చేసిన పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్కు 60,000కు పైగా ఎక్కువ దరఖాస్తులను నిరీక్షిస్తోంది.