Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కలిసికట్టుగా సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, గ్లోబల్ ఇంజినీరింగ్, తయారీ, సాంకేతిక పరిష్కరణల సంస్థ సైయెంట్, తన కార్పొరేట్ సామాజిక బాధ్యతల విభాగం సైంట్ ఫౌండేషన్ ద్వారా జూబ్లీ హిల్స్‌లోని అర్బన్ ఫారెస్ట్రీ డివిజన్ భూమిని, చుట్టుపక్కల ప్రజలు కూర్చునేందుకు, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఒక పార్కుగా అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, ఫౌండేషన్ 3,000మొక్కలను నాటడం ద్వారా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పార్కు స్థానిక నివాసులందరికీ, ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సీనియరు సిటిజన్లకు అందుబాటులో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఈ కార్యక్రమానికి సైయెంట్ ఫౌండేషన్‌కు మద్ధతు ఇచ్చింది. సైయెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బోర్డు సభ్యుడు, ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ప్రస్తుతం ఉన్న ప్రగతిశీల ప్రభుత్వంలో తెలంగాణ సమగ్రంగా అభివృద్ధిని సాధించింది. ఐటి, ఫార్మా, బయోటెక్నాలజీ వంటి పలు రంగాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. హైదరాబాద్ నగరం ఇప్పుడు చాలా రెట్లు విస్తరించింది. హైదరాబాద్ వారసత్వంలో ఒక భాగంగా సైయెంట్ ఉంది. తన ప్రారంభం నుంచి అది నగరం స్థిరత్వానికి తన వంతు మద్ధతు ఇస్తోంది. నగరం పరిశుభ్రంగా, హరిత వనాల అభివృద్ధికిగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) చూపిస్తున్న నిబద్ధత, శ్రమను మేము అభినందిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.
తన ప్రారంభ సుస్థిర అభివృద్ధి నివేదిక ద్వారా సైయెంట్జారీలోకి తీసుకు వచ్చిన తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2025లో భాగంగా ఈ సుందరీకరణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేటి సరళత లేదా “త్రోఅవే” ఆర్థిక వ్యవస్థను మరింత వలయాకారంగా మార్చేందుకు మద్దతు ఇస్తూ, కార్బన్, నీటినిన్యూట్రల్గా మార్చేందుకు మరియు భూమిలోకి వ్యర్థాలు అసలు చేరకుండా ఉండేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. సంస్థ తన డిజైన్ ఫర్ సర్క్యులారిటీ ప్రాక్టీస్‌లో భాగంగా వ్యాపారాల కోసం, ముఖ్యంగా ఇంజనీరింగ్ పరిశ్రమలో అనేక స్థిరమైన పరిష్కారాలను ఇతరులతో కలిసి అభివృద్ధి చేసింది.
ఈ ప్లాంటేషన్ డ్రైవ్‌లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దానం నాగేందర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ (MA&UD) అరవింద్ కుమార్ , ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పి ప్రవిన్య ఐఎఎస్ ఐఎఎస్ పాల్గొన్నారు.