Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగాఅద్భుత ప్రశంసలు అందుకుని, చక్కని కథ, కథనంతో ప్రేక్షకులను హృదయాల్లో చోటు సంపాదించుకుని, అందరినీ ఆకట్టుకున్న యానిమేటెడ్ సినిమాలు రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ మరియు లూకా ఇప్పుడు మూడు భారతీయ భాషల్లో డిస్నీ+ హాట్స్టార్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లూకా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి స్నేహం కోసం వెతుక్కుంటున్నప్పుడు, జీవితాన్ని మార్చే వేసవిని ఆస్వాదించే ఇద్దరు టీనేజ్ సముద్ర రాక్షసులు, రాయ మరియు ది లాస్ట్ డ్రాగన్ఇద్దరూ చివరి డ్రాగన్ను కనుక్కొని, డ్రున్ను నాశనం చేసి, ఆమె ప్రపంచాన్ని కాపాడుతూనే ప్రయాణంలో తనను తాను ఆవిష్కరించుకుంటుంది. కనుక, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్క చోట కూర్చుని డిస్నీ+ హాట్స్టార్ విఐపిలో హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో మరియు డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియంలో నాలుగు భాషలలో ఈ ఉత్తేజకరమైన కథలను వీక్షించండి; రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ జూలై 23 నుంచి మరియు లూకా జూలై 30 నుంచి ప్రసారం కానుంది.
విమర్శకుల నుంచి మంచి సమీక్షలు అందుకున్న ఈ రెండు చిత్రాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువ మంది చర్చించుకోగా, పలువురు ప్రముఖులు ఈ చిత్రాల గురించి ప్రశంసలు గుప్పించారు. కుమంద్ర ఫాంటసీ ప్రపంచంలోని ఎపిక్ అడ్వెంచర్ రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ కథనాన్ని పరిశీలిస్తే, చాలా కాలం క్రితం మానవులు మరియు డ్రాగన్లు కలిసికట్టుగా సామరస్యంతో జీవించేవారు. ఈ పాత్రలకు ప్రముఖ నటులు కెల్లీ మేరీ ట్రాన్, ఆక్వాఫినా, ఇజాక్ వాంగ్, గెమ్మ చాన్, డేనియల్ డే కిమ్, సాండ్రా ఓహ్ తదితరులు తమ గాత్రాన్ని ఇచ్చారు. ఇటాలియన్ రివేరాలోని ఒక అందమైన సముద్రతీర పట్టణానికి చెందిన లూకా అనే బాలుడు, జెలాటో, పాస్తా మరియు అంతులేని స్కూటర్ రైడ్లతో మరపురాని వేసవిని ఆస్వాదిస్తారు. దీనిలో పాత్రలకు జాకబ్ ట్రెంబ్లే, జాక్ డైలాన్ గ్రాజర్, మాయ రుడాల్ఫ్ మరియు జిమ్ గాఫిగాన్గాత్రాన్ని అందించారు.
రాయ ప్రత్యేకత మరియు ఆత్మీయత గురించి నటి మేరీ కెల్లీ ట్రాన్ మాట్లాడుతూ, “రాయ అద్భుతమైన పాత్ర. సినిమా ప్రారంభంలో, మేము మొదట రాయను ఒక చిన్న అమ్మాయిగా వీక్షించినప్పుడు, ఆమె ప్రపంచాన్ని చూసే విధానాన్ని, చెప్పలేని వేదనను అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది. చీకటిగా మారిన ప్రపంచంలో ఆమె అందంగా మనుగడ సాగించేందుకు ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉండగా, ఆమె దాని నుంచి బయటకు వచ్చి చూడటం, రాయతో మళ్లీ ఎలా అనుసంధానం కావాలో తెలుసుకునేందుకు ప్రయత్నించడం చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి మనిషీ తన జీవితంలో ఇటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ అధిగమించవలసి ఉంటుందని నేను భావిస్తున్నాను. అతని లేదా ఆమె జీవితంలో బాధాకరమైన, లేదా కష్ట సమయాల్లో గడిచిన విషయాలు, ఆ సంఘటనలను ఎలా పునరుద్దరించాలో మరియు ప్రపంచంలో మళ్లీ జీవించడం ఎలాగో నేర్చుకోవలసి ఉంది. అది మనుషులు అందరికీ సార్వత్రిక అనుభవం. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం చీకటితో నిండి ఉన్నప్పటికీ, మంచిని ఎలా కనుగొనాలో తెలుసుకునేందుకు మనం తప్పకుండా ప్రయత్నించాలని’’ పేర్కొన్నారు.
సముద్ర రాక్షసుల ఆలోచనల గురించి దర్శకుడు ఎన్రికో కాసరోసా మాట్లాడుతూ “సముద్ర రాక్షసులు వాస్తవంగా, భిన్నమైన లేదా మినహాయించబడిన అనుభూతికి ఒక రూపకం. మా పాత్రలన్నీ ఏదో ఒక విధంగా భిన్నంగా లేదా అసాధారణంగా అనిపిస్తాయనే భావన నాకు చాలా ఇష్టం. లూకా మరియు అల్బెర్టో ఈ అన్య ప్రపంచంలో భాగం కావాలని చాలా ఉత్సుకతతో కోరుకుంటారు - కాని వారు తమను ఎవ్వరూ అంగీకరించరని భయపడుతుంటారు. ఇంకా, వారు సముద్ర రాక్షసులుగా ఉండడానికే ఇష్టపడుతుంటారని’’ వివరించారు. ప్రధాన పాత్ర అయిన లూకా, ఎన్రికోకు తన గాత్రాన్ని ఇచ్చిన జాకబ్ దీని గురించి మరింత వివరిస్తూ, “జాకబ్ గురించి ఆసక్తి ఉంది. అతను ఆత్రుతగా మరియు మర్యాదగా వ్యవహరించడంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడు- పిరికివానిగా ఉన్నప్పటికీ ఉల్లాసకరంగా ఉండే వ్యక్తి. అలాగే అతను అద్భుతమైన నటుడని’’ పేర్కొన్నారు.