Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డనోన్ ఇండియా, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేడు ద ప్రోటీన్ వీక్ (టీపీడబ్ల్యూ) పదిహేనవ ఎడిషన్ ని ఆరంభించింది. ప్రోటీన్, ఆరోగ్యవంతమైన మరియు చురుకైన జీవితాన్ని దారితీయడానికి అంతర్భాగంగా ఉన్న సూక్ష్మ పోషకం ప్రాధాన్యత గురించి చైతన్యం కలిగించడానికి ఇది ఏటా జులై 24-30 మధ్య నిర్వహించబడుతుంది. డబ్ల్యూహెచ్ఓ QoLప్రశ్నావళి మరియు అదనపు సాధనాలు పై ఆధారపడి 2021 మే-జూన్ లలో 2762 మంది భారతీయ వయోజనుల నమూనాతో ఢిల్లీ, ముంబయి, లక్నో, చెన్నై, ఇండోర్, హైదరాబాద్, కొల్ కత్తా మరియు పాట్నాలలో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ (QoL) సర్వే భారతదేశంలో నాలుగు భౌగోళిక జోన్స్ ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో నిర్వహించబడింది.
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు మరియు పర్యావరణం వంటి 4 అంశాల్లో సగటు శాతం స్కోర్స్ ఆధారంగా మరియు భారతీయ వయోజనుల్ని వర్గీకరించడానికి 'మంచి' లేదా 'అధ్వానం'QoL గా కటాఫ్ పాయింట్ వచ్చింది. ఈ క్రింది విషయాలు నివేదించబడ్డాయి.
- భారతీయ వయోజనుల్లో దాదాపు ఇద్దరిలో ఒకరికి అధ్వాన జీవిత నాణ్యత ఉంది (46.2%)
- భారతదేశంలో మరింత మంది మహిళలకుమగవారి (50.4% వెర్సెస్ 42%) కంటే అధ్వాన QoLఉంది మరియు అదే విధంగా మగవారి కంటే మహిళలకు శారీరక ఆరోగ్యం స్కోర్స్ తక్కువగా ఉన్నాయి.
- అధ్వాన జీవిత నాణ్యత స్కోర్ తో కొల్ కత్తా వయోజనులు (65%) అత్యధిక శాతాన్ని నమోదు చేయగా, తదుపరి చెన్నై (49.8%), ఢిల్లీ (48.5%), పాట్నా (46.2%), హైదరాబాద్ (44.4%), లక్నో (40%) మరియు ఇండోర్ లు (39.2%) నమోదు చేసాయి. ముంబయిలో అత్యధికంగా వయోజనులకు ( 68%) మంచి నాణ్యత గల జీవితం ఉందని నమోదైంది.
- శారీరక ఆరోగ్యం మరియు పోషకాహారం మంచి QoLని కలిగి ఉండటంలో ముఖ్యమైన బాధ్యతవహిస్తాయని జవాబులు చెప్పిన భారతదేశంలో దాదాపు అందరూ (99%)అంగీకరించగా మంచి జీవిత నాణ్యత కోసం ప్రోటీన్ సమృద్ధిగా గల ఆహారం ఉండాలని అధ్యయనంలో పాల్గొన్న 98%మంది తమ అభిప్రాయం తెలియచేసారు.
- రోజూ కావలసిన ప్రోటీన్ ఆవశ్యకతని (సిఫారసు చేసిన ఆహారపు అనుమతి) భారతదేశంలో జవాబులు ఇచ్చిన వారిలో కేవలం 9% మంది మాత్రమే కలిగి ఉన్నారు. వ్యాధి నిరోధక శక్తి పనితీరు కోసం మరియు సంపూర్ణ ఆరోగ్యానికి ప్రధానమైన 10 సూక్ష్మ పోషకాలు తీసుకోవడంలో కూడా భారీగా అంతరం ఉంది.
సర్వేలో తెలుసుకున్న విషయాలు గురించి మాట్లాడుతూ, శ్రీ హిమాంషు భక్షి, మేనేజింగ్ డైరక్టర్, డనోన్ ఇండియా ఇలా అన్నారు, "ప్రోటీన్ గురించి సంభాషణల్ని ప్రోత్సహించడానికి మరియు చైతన్యం రూపొందించడానికి , ప్రజా ఆరోగ్యం విషయంలో ప్రధాన స్రవంతిలో భాగంగా చేయడానికి ద ప్రోటీన్ వీక్ ఒక వేదిక. శారీరక ఆరోగ్యం మరియు జీవిత నాణ్యత పై పోషకాహారం ప్రభావాన్ని స్థాపించడే లక్ష్యంతో భారతీయ వయోజనులు యొక్క జీవిత నాణ్యతని అంచనా వేయడానికి ఈ ఏడాది, మేము సర్వే నిర్వహించాము. సరైన పోషకాహారం ఎంపికలు మరియు చురుకుగా ఉండటంలో ప్రభావితం చేసే అంశాల్లో శారీరక ఆరోగ్యం ఒకటి. జవాబులు ఇచ్చిన వారిలో 90% కి పైగా ప్రజలకి శారీరక ఆరోగ్యం మరియు పోషకాహారం గురించి చైతన్యం కలిగినా కూడా జవాబులు ఇచ్చిన వారిలో కేవలం 9% మందికి మాత్రమే తమ ఆహారంలో ప్రోటీన్ కావల్సినంత అందుతోంది, ఇది జాగ్రత్తవహించాల్సిన విషయం. సీఐఐ మరియు పోషకాహారం నిపుణులతో మా సహకారం ద్వారా జీవిత నాణ్యతని మెరుగుపరచడంలో పోషకాహారం మరియు ప్రోటీన్ లు యొక్క బాధ్యత గురించి భారతదేశపు ప్రజల్ని చైతన్యం చేయడానికి మేము ప్రయత్నిస్తాము.
ఆమె తన అభిప్రాయాల్ని పంచుకుంటూ, శ్రీమతి వినీత బాలి, ఛైర్ పర్శన్, సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ న్యూట్రిషన్ ఇలా అన్నారు, “ద ప్రోటీన్ వీక్ యొక్క 5వ ఎడిషన్ కోసం డనోన్ ఇండియాతో సహకారం పొందినందుకు మేము ఆనందిస్తున్నాము. ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలుసుకున్నవి మన నగరాల్లో ఎగువ ఆదాయం గల సమూహాల్లో కూడా పోషకాహారంలో అంతరాల్ని మరోసారి ప్రధానంగా విశదీకరించింది. వినియోగదారులుగా మనం చేసే ఎంపికలు కోసం వ్యక్తిగత బాధ్యతని తీసుకోవడం మరియు సరఫరా విషయంలో, పోషకాహారం మరింత లభించేలా, పొందేలా మరియు తక్కువ ఖరీదుకు లభించేలా చేయడం ద్వారా మాత్రమే దీనిని నిర్వహించవచ్చు. ఈ సమస్యని ఎదుర్కోవడానికి సీఐఐలో, మేము ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగం కంపెనీలతో, అభివృద్ధి ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టబద్ధమైన సంస్థలు మరియు ఎన్జీఓలతో సన్నిహితంగా పని చేయడాన్ని కొనసాగిస్తాము.”
కాలక్రమేణా జీవన శైలి మరియు పర్యావరణ మార్పులు మన జీవిత నాణ్యత పై వ్యతిరేక ప్రభావం చూపించాయి. అధ్వాన ఆహారపు అలవాట్లు, సరైన సమయానికి నిద్రించకపోవడం మరియు పని లేని జీవితం వంటివి దీనిలో బాధ్యతవహించాయి కానీ కొనసాగుతున్న మహమ్మారితో, ఆరోగ్యం మరియు సంక్షేమాలు పై దృష్టిసారించడం కేంద్రీకరించబడ్డాయి. సరైన ఆహారం మరియు కావల్సిన శారీరక కార్యకలాపం ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలిని నిర్వహించడం తప్పనిసరి. ప్రోటీన్ మరియు ఇతర ప్రధానమైన పోషకాలు పై ప్రాధాన్యతతో సంతులిత మరియు పోషకాహారాలు మంచి శక్తి మరియు కదలికల్ని నిర్వహిస్తూనే ఆరోగ్యవంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయని ప్రజలు చైతన్యాన్ని కలిగి ఉండటం ప్రధానం.