Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 ఎడిషన్ విడుదల చేసిన శాంసంగ్
· 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ మాన్స్టర్ బ్యాటరీ కలిగి ఉంది
· జీఎం2 సెన్సార్‌తో అసలైన 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా జోడించుకుంది
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ విడుదల చేసినట్లు వెల్లడించింది. వాట్టా మాన్స్టర్ స్మార్ట్‌ఫోన్ సమగ్రమైన పనితీరును జెన్‌జెడ్, మిల్లీనియల్ వినియోగదారులకు అందించనుంది. గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్, భారీ మాన్స్టర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని విస్తరించతగిన బ్యాటరీ జీవితం కోసం కలిగి ఉంది. అసలైన 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, జీఎం2 సెన్సార్‌తో ఉండటంతో పాటుగా చూడగానే ఆకట్టుకునే 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ ఎఫ్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ యు–డిస్ప్లేను సైతం కలిగి ఉంది.
గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ ధర 4/64జీబీ రకపు ఫోన్‌కు 12,499 రూపాయలు కాగా, 6/128 జీబీ మెమరీ వేరియంట్‌కు 14,499 రూపాయలు. రెండు ప్రకాశవంతమైన రంగులు – ఆర్టిక్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్‌లో ఇది వస్తుంది. గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు జూలై 26 నుంచి అమెజాన్ డాట్ ఇన్, శాంసంగ్ డాట్ కామ్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద జరుగుతాయి. పరిచయ ఆఫర్‌గా, వినియోగదారులు తమ ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై 1000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
‘‘దీని యొక్క మాన్స్టర్ ఫీచర్ల కారణంగా మా యువ మిల్లీనియల్ మరియు జెన్ జెడ్ వినియోగదారుల నుంచి అపూర్వ ఆదరణను గెలాక్సీ ఎం21 అందుకుంది. గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్, శక్తివంతమైన ప్రమాణాలు మరియ వినియోగదారుల లక్ష్యిత ఆవిష్కరణల సమ్మిళిత వారసత్వం కొనసాగిస్తుంది. ఇది భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అసలైన 48 మెగా పిక్సెల్ కెమెరా మరియు అత్యద్భుతమైన ఎస్ అమోలెడ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లే కలిగి ఉంది. గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్, శక్తివంతమైన అనుభవాలను మా వినియోగదారులకు అందించేందుకు సిద్ధంగా ఉంది’’ అని ఆదిత్యబబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్,శాంసంగ్ ఇండియా అన్నారు.
వాట్టా బ్యాటరీ
గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ భారీ పరిమాణం కలిగిన రీతిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది పగలు, రాత్రి తేడా లేకుండా అవసరమైన శక్తిని ఫోన్‌కు అందిస్తుంది. టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్, సాధారణ చార్జింగ్‌తో పోలిస్తే మూడు రెట్ల వేగంతో చార్జింగ్ అవుతుందన్న భరోసా అందిస్తుంది. ఫోన్‌తో పాటుగా 15 వాట్ల అంతర్గత చార్జర్ వస్తుంది. ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో శక్తివంతమైన గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్, వినియోగదారుల అనుభవాలను అత్యద్భుతమైననెట్వర్క్ వేగం మరియు మృదువైన మల్టీ టాస్కింగ్ ద్వారా అందిస్తుంది. ఎక్సీనోస్ 9611 చిప్సెట్, ఏఐ శక్తివంతమైన గేమ్ బూస్టర్‌తో వస్తుంది. ఇది ఫ్రేమ్ రేట్‌ను మెరుగుపరచడంతో పాటుగా స్థిరత్వమూ అందిస్తుంది. అదే సమయంలో మీ అభిమాన గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంధన వినియోగమూ తగ్గిస్తుంది.
వాట్టా డిస్ప్లే
గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌లో అత్యద్భుతమైన సూపర్ అమోలెడ్ 16.21 సెంటీమీటర్లు (6.4 అంగుళాలు) ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్లో లీనమయ్యే వీక్షణ అనుభవాల కోసం కలిగి ఉంది. అందువల్ల అధికంగా స్ర్కీన్లను చూసే వ్యక్తులు తమ అభిమాన కంటెంట్‌ను ప్రయాణ సమయంలో కూడా వీక్షించవచ్చు. వినియోగదారుల ఉపకరణాలను కాపాడేందుకు గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌లో వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీనిలో మోషన్ ప్రింట్ సెన్సార్లు అయినటువంటి యాక్సలరోమీటర్, గైనో సెన్సార్, జియో మాగ్నెటిక్సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు వర్ట్యువల్ లైట్ సెన్సింగ్ ఉన్నాయి.
వాట్టా కెమెరా
గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా మరియు జీఎం2 సెన్సార్ ఉన్నాయి. 8మెగా పిక్సెల్ అలాట్ర వైడ్ కెమెరా, వినియోగదారులు విప్లవాత్మక ల్యాండ్‌స్కేప్స్‌ను 123 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో మానవ కంటిలాగానే ఒడిసిపట్టగలరు. 5మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, వినియోగదారులు అద్భుతమైన పోట్రెయిట్ షాట్స్‌ను లైవ్ ఫోకస్‌తో అందిస్తుంది. దీనిలో 20 మెగా పిక్సెల్ కెమెరా, అంతర్గతంగా నిర్మించిన ఫిల్టర్లు మరియు వైవిధ్యమైన కెమెరా మోడ్స్‌తో వస్తుంది. అందువల్ల వీలైనంతగా అత్యుత్తమ సెల్ఫీలను తీసుకోవచ్చు.
వాట్టా డిజైన్
గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ ప్రకాశవంతమైన రంగులు– ఆర్టిక్ బ్లూ మరియు చార్రోల్ బ్లాక్‌లో వస్తుంది.
ఇతర ఫీచర్లు
గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11, ఒన్ యుఐ కోర్ 3.1తో వస్తుంది. దీనిని మరింతగా మీరు సృజనాత్మకంగా ప్రతి రోజునూ మలుచుకునే రీతిలో డిజైన్ చేశారు. గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌లో తెలివైన మేక్ ఫర్ ఇండియా ఆవిష్కరణలు సైతం ఉన్నాయి. ఇవి కొన్ని ఉపయుక్తమైన, అత్యంత అనుకూలమైన ఫీచర్లు అయినటువంటి బహుభాషా టైపింగ్, ఫైండర్, స్మార్ట్ క్రాప్ కలిగిఉంది. ఇది జెన్ జెడ్, యువ మిల్లీనిల్స్ జీవితాలు వేగవంతంగా, క్రమానుగత జీవితం గడిపేందుకు తోడ్పడుతుంది.