Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంతో లీడింగ్ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఏదంటే అందరు వినియోగదారులు చెప్పే ఏకైక పేరు మేక్ మై ట్రిప్. ఇప్పటికే ఎంతోమంది సేవలు అందించిన మేక్ మై ట్రిప్.. ఇప్పుడు తమ వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశం కూడా రైలు టిక్కెట్స్‌పై. దీనిద్వారా రైలు ప్రయాణాన్ని బుక్ చేసేటప్పుడు వినియోగదారులకు మరిన్ని ఛాయిస్‌లు, ఫ్లెక్సిబులిటీ మరియు సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమయాల్లో చార్ట్ తయారీకి ముందు రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే.. చివరి నిమిషంలో ప్రయాణం రద్దు అవుతుంది. అయితే.. ఇప్పుడు ప్రత్యామ్నాయ రవాణ ప్రయాణ సాధనాలను మరియు ఫైనాన్సింగ్ ఎంపికలను బుక్ చేసుకోవడానికి సహాయపడే ఒక అద్భుతమైన ఫీచర్‌ని మేక్ మై ట్రిప్ ప్రవేశపెట్టింది. అదే ట్రిప్ గ్యారెంటీ. దీనిద్వారా తర్వాతి రోజుల్లో ఫ్లైట్, క్యాబ్, బస్సు లేదా ప్రత్యామ్నాయ రైలు ప్రయాణం ద్వారా కొత్త బుకింగ్‌ను ఎంచుకోవచ్చు.
ఇప్పుడు ఈ ట్రిప్ గ్యారెంటీతో, చివరి నిమిషంలో ఫ్లైట్ లేదా ఇతర టికెట్ కోసం చెల్లించాల్సిన ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణానికి అసలు తేదీ నుంచి 7 రోజులలోపు మేక్ మై ట్రిప్‌లో ఫ్లైట్ లేదా మరొక ట్రావెల్ మోడ్‌ను బుక్ చేసుకోవడానికి వినియోగదారులు రిడీమ్ చేయగలిగే అధిక విలువ కలిగిన ట్రావెల్ వోచర్‌ను అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న మహమ్మారి సమయంలో రైలు టిక్కెట్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే విధంగా మార్చిన విధానంపై మేక్ మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గ్రౌండ్ ట్రాన్ స్పోర్ట్ పరీక్షిత్ చౌదరి మాట్లాడుతూ ఇవాళ, ఈ మహమ్మారి సమయంలో వినియోగదారులు ట్రావెల్ గైడ్‌లైన్స్ అనుసరిస్తూ తమ ప్రయాణం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటారు. ట్రిప్ గ్యారెంటీ అలాంటిదే. ఇప్పుడు ఈ ట్రిప్ గ్యారెంటీతో టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోవడం, వెయిట్ లిస్ట్‌ల ఇబ్బందులు ఉండవు. ఈ ట్రిప్ గ్యారెంటీతో ఉన్న మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే... విమానాలు, క్యాబ్‌లు మొదలైన ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను బుక్ చేసుకునేటప్పుడు అవి రేటు పెరిగినాకూడా 3 రెట్లు అధికంగా రీఫండ్ చేసే విధానానికి మేక్ మైట్రిప్ హామీ ఇస్తోంది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు ప్రతీ ఒక్క ప్రయాణికులు ప్రశాంతంగా ఇప్పుడు రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు ఆయన అని అన్నారు.
రైలు టిక్కెట్ బుక్ చేసుకునేవారికి తమ టిక్కెట్ బుక్ చేసుకునే విషయంలో మరిన్ని అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది మేక్ మై ట్రిప్. ఈ కొత్త విధానంలో క్లస్టర్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల... వినియోగదారులు తమకు కావాల్సిన రూట్లలో ఉన్న ఎక్కువ రైళ్లను సెర్చ్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఒకవేళ మనం బుక్ చేయాలనుకున్న రైలు ఫుల్లు అయితేౌ ఆ రైలు అసలు బోర్డింగ్ పాయింట్ నుంచి 60 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న స్టేషన్లలో ఏదో ఒక స్టేషన్ నుంచి రైలు రిజర్వేషన్ పొందేందుకు ఇది సహాయపడుతుంది. అలాగే, దగ్గరలోని ప్రత్యామ్నాయ స్టేషన్ నుంచి దిగేందుకు, అలాగే ఎక్కేందుకు కూడా ఈ ఆప్షన్ మనకు ఉపయోగ పడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మేక్ మై ట్రిప్ ఉచిత రద్దు విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా చార్ట్ తయారీకి ముందు రైలు టికెట్‌ను రద్దు చేసుకున్నట్ల యితే ప్రయాణీకుడికి పూర్తి డబ్బును వాపసు పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే చివరి నిమిషంలో రద్దు చేసినట్లుయితే... భారీగా రద్దు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసేందుకు కూడా ఈ విధానం రూపొందించబడింది.