Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్ 1 రియాల్టీ షో, షార్క్ ట్యాంక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారతదేశంలో ప్రవేశించనుంది. స్టూడియోనెక్ట్స్ నిర్మిస్తున్న షార్క్ ట్యాంక్ ఇండియా ఇప్పుడు ఆసక్తికరమైన వ్యాపార ఆలోచనలు, వ్యాపార నమూనాలు లేదా చురుకైన వ్యాపారాలు కలిగిన వ్యాపారవేత్తలకు తగిన వేదికగా నిలువడంతో పాటుగా అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, వ్యాపార నిష్ణాతులు పరిశీలించే అవకాశమూ అందిస్తుంది. షార్క్ ట్యాంక్ ఇండియా తొలి సీజన్‌కు రిజిస్ట్రేషన్లు జూన్‌లో ఆరంభం కాగా దీనికి వ్యాపార వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార వాతావరణ నేపథ్యంలో, ఓ చక్కటి వ్యాపార ఆలోచన మీ వ్యవస్థాపక ఆలోచనను వాస్తవ రూపం దాల్చే అవకాశం అందిస్తుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు సోనీ లివ్‌పై చురుగ్గా జరుగుతున్నాయి.
షార్క్ ట్యాంక్ ఇండియా తొలి సీజన్ కోసం స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎడ్వైజర్‌గా వెంచర్ క్యాటలిస్ట్స్తో స్టూడియో నెక్ట్స్ భాగస్వామ్యం చేసుకుంది. భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఇన్క్యుబేటర్ మరియు యాక్సలరేటర్ కంపెనీలలో ఒకటి వెంచర్ క్యాటలిస్ట్స్. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్ధ అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్రను ఇది పోషిస్తుంది. తొలిసారిగా 2001లో టైగర్స్ ఆఫ్ మనీగా జపాన్‌లో నిప్పాన్ టీవీ సృష్టించిన ఈ నమూనాను, ఆ తరువాత కాలంలో యుకెలో డ్రాగన్స్ డెన్‌గా 2005 లో స్వీకరించారు. ఈ షోను యుఎస్‌లో షార్క్ ట్యాంక్‌గా 2009లో తొలిసారిగా ప్రదర్శించారు. ఈ ఫార్మాట్‌ను అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ టెలివిజన్ పంపిణీ చేస్తుంది.
‘‘షార్క్ ట్యాంక్ నమూనా విప్లవాత్మకమైనది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా షార్క్ ట్యాంక్ ఇండియా తొలి సంచికను నిర్మించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాము. ఈ షో ఖచ్చితంగా దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యవస్థాపక వాతావరణానికి తగిన శక్తినందించనుంది. కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలను ప్రదర్శించేందుకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఈ షార్క్స్ తమ వంతు వాటాను సొంతం చేసుకోగలవా? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ! ఈ షో యొక్క స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని వెంచర్ క్యాటలిస్ట్స్ను స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎడ్వైజర్‌గా షార్క్ ట్యాంక్ ఇండియాకు భాగస్వాములుగా చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’. - ఇంద్రానీ చక్రవర్తి, హెడ్– స్టూడియో నెక్ట్స్, ఎస్పీఎన్
‘‘గత 12 సంవత్సరాల కాలంలో షార్క్ ట్యాంక్ , ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల కంపెనీలు సృష్టించబడేందుకు సహాయపడింది. షార్క్ ట్యాంక్ ఇండియా కోసం సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల వెంచర్ క్యాటలిస్ట్ చాలా సంతోషంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా చిన్న పట్టణాలలో కూడా వ్యవస్థాపక ఆసక్తిని పెంపొందించాలనే మా ఆలోచనకు తగినట్లుగా ఈ భాగస్వామ్యం ఉంటుంది. సంయుక్తంగా మేము కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలను భారతదేశపు మారుమూల పట్టణాల నుంచి లేదా భారత్ నుంచి వ్యవస్థాపకులను కూడా వీక్షించగలమని భావిస్తున్నాము. వ్యవస్థాపకుల కోసం, షార్క్ ట్యాంక్ కేవలం నగదు పరంగా ప్రయోజనం అందించే కార్యక్రమం మాత్రమే కాదు, ఆలోచనలను ప్రపంచానికి వెల్లడించే అవకాశం, మెంటారింగ్, అవసరమై మద్దతు పొందడం కూడా అందించే కార్యక్రమం. ఇది ఫౌండర్లకు నేరుగా మార్కెట్‌కు వెళ్లే వ్యూహాలను అందిస్తుంది. ఇవి అత్యంత విలువైనవి. స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎడ్వైజర్‌గా ఈ షోతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము పూర్తి సంతోషంగా ఉన్నాము, వ్యవస్థాపకతలో లోతైన అనుభవం అందించడం ద్వారా అపూర్వ విజయం సాధించే వ్యాపారాలను నిర్మించగలము.’’
-అనూజ్ గొలెచా, కో–ఫౌండర్, వెంచర్ క్యాటలిస్ట్స్