Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాబాలన్, నీనా గుప్తా, అమిత్ సియల్, చంకీ పాండే, ఈషా డియోల్, హీనా ఖాన్ వంటి ప్రముఖులు నటించారు.
హైదరాబాద్: సినిమాకు సరిహద్దుల్లేవు. అది కలల రిబ్బన్- ఆర్సన్ వెల్లెస్ సినిమా సారాంశాన్ని, నేటి వీక్షకులకు సినిమా అంటే ఏంటో - ఈ పదాలు సరిగ్గా పట్టుకుంటాయి. అది ఒక వైవిధ్య, అసంప్రదాయక పట్టకం. సహజ, వైభవోపేత కళ ద్వారా దృక్పథాలను పునర్ నిర్వచిస్తుంది. ఎప్పటికప్పుడు మారుతూ ఉండే మాధ్యమం సినిమా. తన ఆశయ వైభవం పట్ల తిరుగులేని ప్రేమను వి విధ రకాల్లో, రూపాల్లో అది ఆనందిస్తుంటుంది. ప్రముఖుల ఆలోచనలు రేకెత్తించే కథనాలను వేడుక చే సుకునే వేదికగా, తన బ్రాండ్ వాగ్దానం ‘కథలకు కొలువు’ గా వూట్ సెలెక్ట్ ఈ తరహాలో మొదటిదిగా, అతిపెద్ద డైరెక్ట్ –టు- ఓటీటీ ఫిల్మ్ ఫెస్టివల్ – వూట్ సెలెక్ట్ ఫిల్మ్ ఫెస్ట్ - కు రంగం సిద్ధం చేసింది. దేశం న లుమూలల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన సినిమాలు, ఆంతాలజీలతో ఈ ఫెస్ట్ జులై 24న ప్రారంభం కా నుంది. 8 రోజుల వ్యవధిలో విమర్శకుల నుంచి ఎంతగానో ప్రశంసలు పొందిన 15 సినిమాలను ఇది ప్రదర్శించనుంది.
వూట్ సెలెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సామాజిక సంబంధిత అంశాలపై దృష్టి పెట్టిన కొన్ని చక్కటి స్ఫూర్తిదాయక కథ లతో సంప్రదాయాలను సవాల్ చేసిన అద్భుత కళాఖండాలను అందించనుంది. #IndiaUnfiltered ను ప్రద ర్శించనుంది. నట్ కట్, షూరుఅత్ కా ట్విస్ట్ (ఆంతాలజీ), ఏక్ దువా, లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కరోనా (ఆంతాలజీ), జాన్ జిగర్, ది శైలా(స్), లిహాఫ్ లాంటి సినిమాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాను న్నాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెంది, ఆస్కార్ కు నామినేట్ అయిన నట్ కట్ మన సమాజంలో పాతుకుపోయి న పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తుంది. లింగసమానత్వాన్ని చాటిచెబుతుంది. ఏక్ దువా విషయానికి వస్తే, కుటుంబవ్యవస్థలోని లింగ వివక్షపై వెలుగులు ప్రసరిస్తుంది. షూరుఅత్ కా ట్విస్ట్ అనేది 6 పొట్టి సినిమాల ఓమ్నిబస్. రాజ్ కుమార్ హిరాని, విక్రమాదిత్య మోత్వానె, రాజ్ కుమార్ గుప్తా, అమిత్ వి. మసూర్కర్ వీ టిని రూపొందించారు. పేరుకు తగ్గట్టుగా ఈ పొట్టి కథల్లో వివిధ రకాల ‘ట్విస్టు’లు ఉంటాయి. శైలాస్ అనేది డబ్బు, కులం సరిహద్దులచే ఏర్పడిన గందరగోళ సంబంధాలకు అద్దం పడుతుంది. జాన్ జిగర్ అనేది ఉత్తరభారతదేశంలో ఓ చిన్న పట్టణంలో ‘ప్రేమ’ చుట్టూరా ఉండే మోరల్ పోలీసింగ్ ను కళ్ళకు కడుతుంది.
లీహాఫ్ అనేది ప్రముఖ రచయిత ఇస్మాత్ చుగ్తాయ్ లీహాఫ్ పేరుతో రాసిన అత్యంత ప్రముఖ కథకు దృశ్యరూపం. పురుషాధిక్య సమాజంలో స్వలింగ ప్రేమ, మహిళల వాక్ స్వాతంత్ర్యం లాంటివి ఇందులో ఉన్నాయి. లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కరోనా అనేది వినోదాత్మకంగా చక్కటి స్టోరీ టెల్లింగ్ తో నడిచే కథ. మరింత అవగాహనతో తమ జీవితాలకు ముఖ్యమైంది ఏంటో తేల్చుకునే ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. లైన్స్ అనేది 1999ల నాటి సినిమా. ఒక యువతి సరిహద్దుల్లో వేరై పోయి చివరకు తన భర్తను ఎలా చేరుకుంటుందో తెలియజేస్తుంది. సినిమా,కళకు చేసిన అద్భుతమైన కృషికి ప్రసిద్ది చెందిన విద్యాబాలన్, నీనా గుప్తా, అమిత్ సి యాల్, చంకీ పాండే, ఇషా డియోల్, హినా ఖాన్, దీపన్నితా శర్మ, షిబాని దండేకర్, ఆదిల్ హుస్సేన్, కనీజ్ సుర్కా, తన్నీష్ఠా ఛటర్జీ, అనుష్కా సేన్ లాంటి వారు ఈ సినిమాల్లో నటించారు.
షూరుఅత్ కా ట్విస్ట్ లో నటించిన చంకీ పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఓ గొప్ప పని చేస్తున్నారు. భారతదేశంలో వూట్ సెలెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అతిపెద్ద సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. నేటి కాలపు అ సలైన, నిజమైన, సామాజిక సంబంధిత అంశాలు వీటిలో ఉన్నాయి. థీమ్ ‘ట్విస్ట్’ ను చాటిచెప్పేలా షూ రుఅత్ కా ట్విస్ట్ ఆంతాలజీ లోని నా సినిమా టప్ టప్ ఓ గాయకుడు తన కెరీర్ ఆరంభంలో ఎదు ర్కొన్న చిక్కులు ఉంటాయి. ఆ పాత్రకు నాకు ఎంతో దగ్గరి సంబంధం ఉంది. ఆ పాత్ర పోషించేటప్పుడు ఎంతో ఆనందించాను. వీక్షకులు కూడా దాన్ని ఇష్టపడుతారని భావిస్తున్నాను’’ అని అన్నారు. ఏక్ దువా గురించి ఈషా డియోల్ మాట్లాడుతూ, ‘‘వూట్ సెలెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ఒక చక్కటి వేదికపై మన కృషి కనిపించడం అంటే అదో గొప్ప గౌరవం. ఎన్నో స్ఫూర్తిదాయక కథలను అది ప్రదర్శించనుంది. నే ను సొంతంగా నిర్మించిన ‘ఏక్ దువా’ చిత్రం నాకు గర్వకారణం. ఆ సినిమాలో అబిదా పాత్ర నాకు చక్కటి అనుభూతిని అందించింది. అబిదా తన ఇంట్లోనే లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. అలాంటి ఓ పెద్ద సమస్యపై నా వంతుగా ఏక్ దువా తీశాను. భావోద్వేగపరంగా ఆ పాత్రకు కష్టపడినంతగా గతంలో మరే పాత్రకు కూడా కష్టపడలేదు. కఠోర పరిశ్రమ నుంచి పుట్టుకొచ్చిన సినిమా అది. వీక్షకులను అది భావావేశంలోకి తీసుకెళ్తుంది’’ అని అన్నారు.
ప్రముఖ నటి హీనా ఖాన్ మాట్లాడుతూ, ‘‘అదుపు చేయలేని భావోద్వేగాలతో రూపుదిద్దుకున్న సినిమా లై న్స్. ఓ శక్తివంతమైన కథ. సరిహద్దులతో వేరైపోయిన ఓ అందమైన అమాయక జంట కథ. ఒకరినొకరు క లుసుకునేందుకు వారు చేసిన పోరాటమే ఈ సినిమా. ప్రయోగాలు చేస్తూ వీక్షకులను ఆశ్చర్యపరచడాన్ని నేను విశ్వసిస్తాను. నాలో ఉండే విభిన్న కోణాన్ని వూట్ సెలెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమయ్యే లైన్స్ చూపిస్తుంది. అందులో నటించడం నేర్చుకోవడం మాత్రమే కాదు, నన్ను నేను తెలుసుకోవడం కూడా. నా అభిమానులకు ఇది నచ్చుతుందని, వారు దీన్ని ప్రశంసిస్తారని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.