Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద దర్శకుడు, ఐకాన్ కరణ్ జోహార్ బిగ్ బాస్ ఓటీటీ బ్లాక్ బస్టర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తొలి ఆరు వారాలు కరణ్ హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్స్ నేరుగా టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్(voot)లో 24×7 ప్రసారం కానుంది. ఆగస్టు 8నుంచి ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ స్పందిస్తూ..'బిగ్‌బాస్ షోకి నేను, మా అమ్మ పెద్ద ఫ్యాన్స్. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తాం. అంతేకాకుండా నేను ఎప్పటికైనా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయాలని మా అమ్మ కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుందని తెలిపారు. గతంలో ఎన్నో షోలకు హోస్ట్‌గా చేయడాన్ని ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా చేయడం మరింత ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు.