Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎల్టీని ఏర్పాటుచేసిన ఇండియా ఫస్ట్ లైఫ్
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తోన్న ఇండియా ఫస్ట్ లైఫ్ సీనియర్ నాయకత్వ బృందం(ఎస్ఎల్టీ)ని నియామించింది. ఈ సంస్థ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతలను ఈ ఎస్ఎల్టీ వేగవంతం చేయనుంది. ఈ మేనేజ్మెంట్ కమిటీ (మాన్కామ్)లో అత్యంత చురుకైన పాత్ర పోషించడంతో పాటుగా ప్రతి ఒక్కరికీ భీమా అనే కంపెనీ లక్ష్యం సాకారం చేసే దిశగా తమ ప్రయత్నాలను చేయనున్నారు. ఈ సందర్భంగా కంపెనీ డిప్యూటీ సీఈఓ రుషబ్ గాంధీ, మాట్లాడుతూ ‘‘ దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జీవిత భీమా కంపెనీలలో ఇండియా ఫస్ట్ లైఫ్ ఒకటి. మా తరువాత దశ వృద్ధికి తోడ్పాటునందించేందుకు మేము మా సీనియర్ నాయకత్వ బృందం (ఎస్ఎల్టీ) ను ఏర్పాటుచేశాం. ఈ కంపెనీ నాలుగు సంవత్సరాలుగా గ్రేట్ ప్లేస్ టు వర్క్ గా గుర్తించబడుతుంది. 2021 సంవత్సరానికిగానూ పనిచేసేందుకు అనువైన అత్యున్నత 100 కంపెనీల జాబితాలో కూడా గుర్తింపు పొందిందని తెలిపారు.