Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తమ మొట్టమొదటి అంతర్జాతీయ ఫండ్ ఐడీఎఫ్సీ యుఎస్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను జూలై 29న విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఆగస్టు 12తో ముగియనున్నది. ఈ సందర్భంగా ఐడీఎఫ్సీ ఎస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏఎంసీ), సీఈవో విశాల్ కపూర్ మాట్లాడుతూ 'ఓ అంతర్జాతీయ ఫండ్‌ను సైతం జోడించడం వల్ల మదుపరుల పెట్టుబడుల జాబితాకు భౌగోళిక వైవిధ్యీకరణను తీసుకురావడంలో సహాయపడుతుంది. అయితే, ఓ అంతర్జాతీయ ఫండ్‌ను ఎంచుకునే ముందు మదుపరులు, ఒకవేళ తాము పెట్టుబడి పెట్టబోయే ఫండ్ కాంప్లిమెంటరీయా అన్నది పరిశీలించాలి. ఐడీఎఫ్సీ యుఎస్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్, భారతీయ ఈక్విటీలతో అతి తక్కువ సంబంధం కలిగి ఉండటం వల్ల ఇన్వెస్టర్ల జాబితాకు కాంప్లిమెంటరీ జోడింపును అందిస్తుంది. అదనంగా, ఇది మదుపరులకు యుఎస్ ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టేందుకు శక్తివంతమైన అవకాశాన్నీ అందిస్తుంది. విభిన్న మార్కెట్ల వ్యాప్తంగా యుఎస్ మార్కెట్ లో నూతన తరపు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ వినూత్న వ్యాపారాల నుంచి మదుపరులు ప్రయోజనం పొందగలరు' అని అన్నారు.