Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అగ్రగామి స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పో ఇండియా తన 5జి ల్యాబ్‌లో జియో అందించిన 5జి ఎస్ఎ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్లో రెనో 6 సిరీస్ 5జి స్వతంత్ర నెట్వర్క్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఒప్పో రెనో6 సిరీస్ ప్రయోగం ఒప్పో ప్రీమియం శ్రేణిలో అత్యాధునికమైనది కాగా, అత్యంత ఎక్కువ సకారాత్మక ఫలితాలను ఇచ్చింది. ఈ ప్రయోగానికి వచ్చిన ఉత్తేజనకారి ఫలితాలతో రెనో 6 సిరీస్ రెండు పరికరాల సామర్థ్యాన్ని స్థిరపరచగా, ఉన్నత నాణ్యత 5జి అనుభవాన్ని వాస్తవరూపానికి తీసుకు వచ్చింది. రెనో6 ప్రో 11 5జి బ్యాండ్‌కు మద్ధతు ఇస్తుండగా, రెనో6 13 5జి బ్యాండ్ సేవలను అందుకునేందుకు అనుగుణంగా ఉంది. ఇది భారతదేశంలో 5జి డివైజ్ ఎకోసిస్టం అభివృద్ధిని ఉత్తేజిస్తుండగా వినియోగదారులకు 5జిని భారతదేశం అలాగే ప్రపంచంలోని ఇతర భాగాల్లో అందుబాటులో ఉండేలా అనుభవాన్ని పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఒప్పో ఇండియా ఉపాధ్యక్షుడు మరియు ఆర్ & డి అధికారి తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం 5జి సేవలు అందుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తుండగా, , ఒప్పో ఇండియా 5జి అలవర్చుకోవడాన్ని కొనసాగిస్తూ మరియు దాని ప్రతి ఒక్కరూ దాని ప్రయోజనాలను అందుకునేలా అలుపెరుగకుండా శ్రమిస్తోంది. జియోతో రెనో6 సిరీస్ మా 5జి స్వతంత్ర నెట్వర్క్ ప్రయోగం 5జి యుగంలో వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడంలో లోతైన మా పరిశోధనలో భాగంగా ఉంది. జియో 5జి ఎస్ఏ నెట్‌వర్క్‌లో రెనో 6 సిరీస్ పరికరాల విజయవంతమైన మూల్యాంకన మా వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతను అందించడంలో మా నిబద్ధతకు సాక్ష్యంగా ఉంది’’ అని తెలిపారు. ఎస్ఏ ఆర్కిటెక్చర్ భవిష్యత్తులో 5జి నెట్‌వర్క్‌లో ప్రధాన స్రవంతి ఆర్కిటెక్చర్లలో ఒకటిగా ఉంది. ఒప్పో భారతదేశంలో తన 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా క్రియాశీలకంగా 5జి ఎస్ఏ నెట్‌వర్క్‌కు పునాదులను నిర్మిస్తుంది. భారతదేశంలో పలు 5జి పరీక్షలు స్వతంత్రమైన మోడళ్లను అనుసరించడం లేదు. ఒప్పో స్వతంత్ర ప్లాట్‌ఫారాలపై పరిష్కరణలను అభివృద్ధి పరచగా, అది విశ్వసనీయమైన 5జి సెటప్‌గా ఉంది. జియో భారతదేశంలో 5జి ఎకోసిస్టమ్ అభివృద్ధి పరచేందుకు కట్టుబడి ఉండగా, ఈ పరికరాలు పరీక్షకు 5జి స్వతంత్ర నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ను అందించింది. ఈ ప్రయత్నాల ద్వారా ఒప్పో ఒకసారి వాణిజ్యీకరణ అయిన తరువాత ప్రతి అడాప్టర్‌ను కూడా అసలైన 5జి పరికరం అనుభవాన్ని అందుకోవడాన్ని ధృవీకరిస్తుంది. ఇది భారతదేశంలో 5జి సాంకేతికత అభివృద్ధికి ఎక్కువ దృష్టి సారించిన సమయంలో అందుబాటులోకి వచ్చింది మరియు భారతదేశపు పరికరం ఎకోసిస్టమ్‌ను భవిష్యత్తుకు తయారుగా ఉంచడంలో ప్రముఖమైనది. ఒప్పో భారతదేశంలో 5జి సాంకేతికతను అభివృద్ధిపరచడంలో నిరంతర పరిశోధన మరియు అభివృద్ధిపై పెట్టుబడి పెట్టడంలో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ బ్రాండ్ 5జి సాంకేతికతను మెరుగుపరచేందుకు కావలసిన భాగస్వాములతో కలిసి సన్నిహితంగా పని చేస్తోంది మరియు ఎక్కువ మంది ప్రజలను అనుసంధానం చేసేందుకు అగ్రగామి క్యారియర్లు మరియు రిటైలర్ల భాగస్వామ్యంలో వినియోగదారులకు అనుభవాన్ని వృద్ధి చేసేందుకు శ్రమిస్తోంది. భారతదేశంలో 5జి సాంకేతికతను ప్రజాస్వామ్యబద్ధం చేసే లక్ష్యంతో మరియు అందరికీ అది లభ్యమయ్యేలా చేసేందుకు ఒప్పో భారతదేశంలో 6 5జి పరికరాలను 2021లో అన్ని ధరల శ్రేణిలో విడుదల చేసింది. మరింత ముందుకు వెళ్లి ఒప్పో వేగవంతంగా వృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు, వ్యాపారానికి ఎక్కువ సాంకేతిక ఆవిష్కరణ చేసేందుకు మరియు తన వినియోగదారులకు ఉత్తమ ఉత్పత్తులను మరియు సేవలను అందించేందుకు సిద్ధమైంది. జర్మనీకి చెందిన అగ్రగామి పరిశోధన సంస్థ-ఐప్లిటిక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఒప్పో 2021లో ప్రకటించిన 5జి పేటెంట్ కుటుంబాల్లో టాప్ పది కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఇది 20కు పైగా ఎక్కువ దేశాలకు మరియు ప్రపంచ వ్యాప్తంగా తన 5జి పేటెంట్లను కలిగి ఉంది అలాగే గ్లోబల్ పేటెంట్ అర్జీల 3,900 ఫ్యామిలీలతో నిండి ఉంది మరియు, 5జి స్టాండర్డ్ పేటెంట్ల 1,600 ఫ్యామిలీలను ఇటిఎస్ఐకు మరియు 3జిపిపికు 3,000కు పైగా 5జి-స్టాండర్డ్ సంబంధిత ప్రస్థావనలను సమర్పించింది. ఒప్పో భారతదేశంలో 5జి సేవలను జారీలోకి తీసుకు వచ్చేందుకు అపారమైన దృష్టి పెట్టింది మరియు దేశంలో 5జి వాట్సప్ వీడియో కాల్స్‌ను నిర్వహించిన మొదటి బ్రాండ్‌గా నిలిచింది. 2020లో ఒప్పో తన 5జి ఎకోసిస్టమ్‌కు కేంద్ర ఉత్పత్తుల సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లోని ఆర్ & డి సెంటర్లో 5జి ఇన్నోవేషన్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించింది.