Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జవహార్ నవోదయ విద్యాలయం (జెఎన్‌వీ) నుండి ఐఐటీ, నిట్ కు అర్హత సాధించిన 544 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు శాంసంగ్ స్టార్ ప్రోగ్రామ్‌లో భాగంగా స్కాలర్షిప్లను మంజూరు చేసింది. ఆరేండ్లగా నిర్వహిస్తున్న శాంసంగ్ స్టార్ స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా 800 మంది జెఎన్‌వీ విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం క్రింద, శాంసంగ్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లను ప్రతిభావంతులైన, బీటెక్/డ్యూయల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్) కోర్సులను ఏదైనా ఐఐటీ లేదా నిట్ లో చేయాలని కోరుకుంటున్న జెఎన్‌వీ విద్యార్థులకు అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి ఐదేండ్ల పాటు రెండు లక్షల రూపాయల వరకూ స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, హాస్టల్, మెస్ వసతుల కోసం ప్రతి సంవత్సరం విద్యార్థికి అందించనున్నట్టు శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పార్ధ ఘోష్ తెలిపారు.
ఈ సందర్భంగా ‘‘తమ టుగెదర్ ఫర్ టుమారో! ఎనేబ్లింగ్ పీపుల్ అనే తమ సిటిజన్‌షిప్ లక్ష్యంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా యువతకు అత్యుత్తమ విద్య, అభ్యాస అవకాశాలను అందించేందుకు శాంసంగ్ సహాయపడుతుంది. శాంసంగ్ స్టార్ స్కాలర్షిప్ కార్యక్రమం, మా పవరింగ్ డిజిటల్ ఇండియా లక్ష్యంకు ప్రతిరూపం. దీనిద్వారా భావితరపు యువ భారతానికి తగిన సాధికారిత అందించాలనుకుంటున్నాం. మేము స్టార్ స్కాలర్ ప్రోగ్రామ్ ఆరవ సంవత్సరంలో ప్రవేశిస్తున్న వేళ, దేశాన్ని సమూలంగా మార్చగల భావితరానికి చెందిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతునందిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము..’’ అని , వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్, కార్పోరేట్ సిటిజన్‌షిప్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ఈ సంవత్సరం, ఈ కార్యక్రమం ద్వారా 150 స్కాలర్షిప్లను జెఎన్వీకు చెందిన నూతన దరఖాస్తుదారులకు అందించడం జరిగింది. వీరిలో 87 మంది తమ ప్రయాణాన్ని విభిన్నమైన ఐఐటీలు మరియు 63 మంది విభిన్నమైన నిట్లవ్యాప్తంగా ఆరంభించనున్నారు. అదనంగా, 394 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను తరువాత సంవత్సరం కోసం పునరుద్ధరించడం జరిగింది. పునరుద్ధరించబడిన స్కాలర్షిప్లను అందుకున్న వారిలో 139 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉండగా, 171మంది తృతీయ సంవత్సర, 82 మంది నాల్గవ సంవత్సర విద్యార్థులు, ఇద్దరు ఐదవ సంవత్సర విద్యార్థులు ఉన్నారు.
తొలి సంవత్సర విద్యార్థులను జెఈఈ మెయిన్‌లో సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే రెండు నుంచి 4/5 సంవత్సరాల విద్యార్థులకు స్కాలర్షిప్ పునరుద్ధరించుకోవడానికి వారు తమ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజీ (ఎస్‌జీపీఏ)ను నిర్వహించడం లేదా క్యుమిలేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీపీజీఏ) రేటింగ్‌ను 5 లేదా అంతకు మించి నిర్వహించడం అవసరం. శాంసంగ్ స్మార్ట్ స్కూల్ ప్రోగ్రామ్ కోసం శాంసంగ్ ఇండియా, నవోదయ విద్యాలయ సమితి భాగస్వామ్యం చేసుకున్నాయి. 2013 సంవత్సరం ఆరంభించి గ్రామీణ బీద వర్గాలకు చెందిన విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడం లక్ష్యంగా దీనిని ఆరంభించాయి.
శాంసంగ్ ఇప్పుడు 80 నూతన జెఎన్వీలకు స్మార్ట్ క్లాసెస్‌ను జోడించింది. తద్వారా శాంసంగ్ తమ స్మార్ట్ క్లాస్‌లను ఏర్పాటుచేసిన జెఎన్వీల సంఖ్య 625కు చేరింది. తద్వారా 5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకూ, 8వేల మందికి పైగా టీచర్లకు ప్రభావవంతంగా బోధన చేసేందుకు ఇంటరాక్టివ్ సాంకేతికతను ఏ విధంగా వినియోగించాలన్నది శిక్షణ అందించారు.తద్వారా బోధన నాణ్యత మెరుగుపరచడంతో పాటుగా జెఎన్‌వీ పాఠశాలల్లో సామర్థ్య నిర్మాణమూ చేశారు. ప్రతి శాంసంగ్ స్మార్ట్‌క్లాస్, ఇంటరాక్టివ్ శాంసంగ్ స్మార్ట్బోర్డులను, శాంసంగ్ ట్యాబ్లెట్లు, ఓ ప్రింటర్, వై–ఫై కనెక్టివిటీ మరియు పవర్ బ్యాకప్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ స్టార్ స్కాలర్ ప్రోగ్రామ్ గురించి మరింతగా తెలుసుకోవడానికి దయచేసి శాంసంగ్ వెబ్సైట్ https://www.samsung.com/in/microsite/sapne-hue-bade/star-scholar/ చూడండి.