Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జవహార్ నవోదయ విద్యాలయం (జెఎన్వీ) నుండి ఐఐటీ, నిట్ కు అర్హత సాధించిన 544 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు శాంసంగ్ స్టార్ ప్రోగ్రామ్లో భాగంగా స్కాలర్షిప్లను మంజూరు చేసింది. ఆరేండ్లగా నిర్వహిస్తున్న శాంసంగ్ స్టార్ స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా 800 మంది జెఎన్వీ విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం క్రింద, శాంసంగ్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లను ప్రతిభావంతులైన, బీటెక్/డ్యూయల్ డిగ్రీ (బీటెక్ంఎంటెక్) కోర్సులను ఏదైనా ఐఐటీ లేదా నిట్ లో చేయాలని కోరుకుం టున్న జెఎన్వీ విద్యార్థులకు అందిస్తుంది.