Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పోషకాహార బ్రాండు ప్యూచర్లైఫ్ కొత్తగా ఇ-కామర్స్ వేదికను ప్రారంభించినట్లు ప్రకటించింది. తమ ప్యూచర్లైఫ్ స్మార్ట్ యాప్లో తొలిసారి స్మార్ట్ వైట్ ఓట్స్ను ఆవిష్కరించినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండోదశలో హల్దీరామ్ ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నామని ప్యూచర్లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ బన్ తెలిపారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో మరింత విస్తరించి, కొత్త ఉత్పత్తిని ప్రవేశపెడుతున్నామన్నారు.