Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లూమ్బర్గ్ సర్వే
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుత ఏడాది ద్వితీయార్థంలో ధరలు మరింత పెరుగొచ్చని బ్లూమ్బర్గ్ సర్వేలో ఆందోళన వ్యక్తం అయ్యింది.ఆర్థిక నిపుణుల అభిప్రాయాలతో రూపొందించిన ఈ సర్వే ప్రకారం.. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం సూచీలు రెండంకెల స్థాయికి చేరొచ్చు. ఈ ఏడాది జులైలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 10.71 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 10.12 శాతంగా చోటు చేసుకోవచ్చు. ఇంతక్రితం త్రైమాసికంలో ఈ అంచనా 9.13 శాతంగా ఉంది. 2021 చివరి రెండు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 5.7 శాతానికి చేరొ చ్చని ఆందోళన వ్యక్తమైంది. ఇంతక్రితం ఈ అంచనా 5.2 శాతంగా ఉంది.