Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.4.98 లక్షలు
హైదరాబాద్ : ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ బైకుల తయారీ కంపెనీ బెనెల్లీ గురువారం భారత మార్కెట్లోకి బెనెల్లీ అల్టిమేట్ అర్బన్ క్రూసెర్ 502సిని విడుదల చేసింది.ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ.4.98 లక్షలుగా నిర్ణయిం చింది. 500 సిసి సామర్థ్యం, నాలుగు గేర్లు, రెండు సిలీండర్ ఇంజిన్లు,డబుల్ బ్యారెల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్జాస్ట్ పైపులతో దీన్ని రూపొందించింది.ఈ బైకులను వచ్చే ఆగస్టు నుంచి కొనుగోలుదారులకు అందించనున్నట్లు బెనెల్లీ ఇండియా ఎండి వికాస్ ఝబక్ తెలిపారు.అత్యంత ఆకర్షణీయ పనితీరు కలిగిన ఈ 502సి క్రూసెర్ను అద్బుత డిజైన్‌తో ఆవిష్కరి ంచామన్నారు.ఈ కొత్త వేరియంట్‌తో భారత్‌లో మరింత మంది కొత్త ఖాతాదారులను జోడించుకోనున్నామని వికాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.