Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమ సంస్థలో లక్ష మందికి పైగా డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సిన్ (కనీసం ఒక డోస్) వేయించినట్టు ఈరోజు ఉబెర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థలో లక్షా 50 వేల మందికి టీకా వేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఉబెర్. దీని కోసం 18.5 కోట్ల రూపాయలు కేటాయించింది. గత నెలలో మొదటి మైలురాయిని ప్రకటించిన తరువాత ఉబెర్, తన డ్రైవర్ టీకాలపై వేగంగా పురోగతి సాధించింది. కోవిన్ పోర్టల్ నుండి సేకరించిన డ్రైవర్ల డిజిటల్ టీకా ధృవీకరణ పత్రాలతో ఉబెర్ లో నమోదు చేసిన డ్రైవర్ వివరాలను సరిపోల్చడం ద్వారా ప్రతి టీకాను ప్రామాణీకరించడానికి.. బలమైన టెక్నాలజీ ధృవీకరణ ప్రక్రియను అభివృద్ధి చేసింది ఉబెర్ సంస్థ. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, టీకాలు వేయడానికి గడిపిన సమయం కోసం డ్రైవర్లు ప్రతి రెండు షాట్లకు 400 రూపాయలు అందుకుంటారు. డ్రైవర్లకు టీకాలపై ఉన్న అపోహల్ని, అనుమానాల్ని తొలిగించడానికి.. టీకా ఆవశ్యకతను చాటిచెప్పడానికి.. వైద్య నిపుణులతో సందేశాలు, వీడియోలు మరియు వర్చువల్ మీటింగ్స్ ద్వారా సంస్థ డ్రైవర్లలో అవగాహన కల్పిస్తోంది.
కరోనా క్లిష్ట సమయంలో.. భారత ప్రభుత్వానికి ఉబెర్ అందించిన మద్దతుకు అన్ని వర్గాల నుంచి అభినందనలు దక్కాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. "ఈ క్లిష్ట సమయాల్లో, దేశవ్యాప్తంగా అవసరమైన సేవలను అందించడానికి, రవాణా కార్మికులు ఫ్రంట్‌లైన్ కార్మికులుగా అవతరించారు. ప్రత్యేకించి, రైడ్‌షేర్ డ్రైవర్లు సిబ్బంది, అవసరమైన సామాగ్రి, మందులు, ప్రాణాలు కాపాడే పరికరాలను తరలించడానికి ఆన్-డిమాండ్ ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తిని ప్రదర్శించారు. డ్రైవర్ల ఆరోగ్యం, భద్రత కోసం ఉబెర్ ఇండియా వారి సంస్థపై అనేక సంక్షేమ చర్యలు చేపట్టడం చూసి నేను సంతోషించాను. ముఖ్యంగా, రెండు టీకా మోతాదుల కోసం డ్రైవర్లకు నగదు ప్రోత్సాహకాలు అందించే ఉబెర్ చొరవను నేను అభినందిస్తున్నాను. రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ఉబెర్ ఇండియా ప్రదర్శిస్తున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను. భవిష్యత్ లో వారికి మరింత మంచి జరగాలని కోరుకుంటున్నాను." సంస్థ సాధించిన ఘనతపై, ఉబెర్ ఇండియా సౌత్-ఏషియా అధ్యక్షుడు ప్రభుజీత్ సింగ్ మాట్లాడుతూ.."కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని నిరూపితమైన దృష్ట్యా, టీకాలు వేసుకున్న ఎక్కువ మంది డ్రైవర్లు మా సంస్థలో మెరుగైన భద్రతను సూచిస్తారని, ప్రయాణికులకు మరింత భద్రత, విశ్వాసాన్ని అందిస్తారని మేం నమ్ముతున్నాం. మాకు డ్రైవర్ల నుండి మంచి స్పందన వచ్చింది. మా సంస్థలో రైడర్స్, డ్రైవర్లకు టీకాలు ఇప్పించే అంశానికి మేం కట్టుబడి ఉన్నాం. టీకాలు వేయడంతో పాటు.. రైడ్స్‌లో తప్పనిసరి మాస్క్ ధరించడం, వాహనాన్ని శానిటైజ్ చేయడం సహా ఇతర భద్రతా చర్యలను పాటించడంతో మేం సురక్షితమైన ట్రావెల్ జోన్‌ను రూపొందిస్తున్నాం."
బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, బరేలీ, గోరఖ్‌పూర్, జైపూర్, భోపాల్, భువనేశ్వర్‌లతో సహా 12 భారతీయ నగరాల్లో డ్రైవర్లకు ఉచిత టీకాలు వేయడానికి ఉబెర్, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతిస్తోంది. ప్రైవేట్ లేదా ప్రభుత్వ టీకా కేంద్రాల వద్ద వ్యాక్సిన్లు వేయించుకున్న డ్రైవర్ల మధ్య కంపెనీ తేడా చూడడం లేదు. టీకాకు సంబంధించిన సరైన డాక్యుమెంట్ ను చూపించిన డ్రైవర్లు అందరికీ పరిహారం అందిస్తోంది. కొవిడ్-19 తో బాధపడుతున్న డ్రైవర్ల కోసం 14 రోజుల పాక్షిక సంపాదన సహాయ కార్యక్రమంతో పాటు.. పలు ఇతర కార్యక్రమాల ద్వారా తన మద్దతు ప్రకటిస్తోంది ఉబెర్. కొవిడ్-19 తో దురదృష్టవశాత్తూ డ్రైవర్ మరణిస్తే, 75,000 రూపాయల విలువైన వన్-టైమ్ సపోర్ట్ ప్యాకేజీని ఉబెర్ అందిస్తుంది. మరణించిన డ్రైవర్ కుటుంబ తక్షణ అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి ఉబెర్ ఎల్లప్పుడూ భారతదేశం యొక్క ప్రతి స్పందనను సమర్థించింది, బలోపేతం చేసింది. ఈ ఏడాది మార్చిలో, ప్రజలు టీకా కేంద్రాలకు వెళ్లడానికి, 10 కోట్ల రూపాయల విలువైన ఉచిత రైడ్లు అందించి సహాయం చేసింది. ప్రాణాలను కాపాడటానికి మరియు నిలబెట్టుకోవటానికి అత్యవసర సహాయాన్ని అందించే అనేక స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ ట్రేటర్లు, వెంటిలేటర్లు మరియు ఇతర క్లిష్ట వైద్య పరికరాల రవాణాను సులభతరం చేయడానికి జూన్ నెలలో, 3 కోట్ల 65 లక్షల రూపాయల అదనపు ఉచిత రైడ్లను ప్రకటించింది.