Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో ఇంటి ఆధారిత 'డయాలసిస్ ఆన్ కాల్' సేవలను ప్రారంభించినట్లు నెఫ్రోప్లస్ ప్రకటించింది. దీంతో డయాలసిస్ సెటప్‌ను రోగి దగ్గరికే తీసుకెళ్లడం ద్వారా వారికి సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయని ఆ సంస్థ పేర్కొంది. కరోనా వైరస్ పట్ల రోగులు అప్రమత్తంగా ఉంటున్న నేపథ్యంలో హోమ్ డయాలసిస్‌లో గొప్ప పెరుగుదల ఉందని తెలిపింది. డయాలసిస్ చికిత్సలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఇటువంటి ఆధునిక విధానాన్ని తాము మొదటిసారిగా ప్రారంభించినట్లు నెఫ్రోప్లస్ తెలిపింది.