Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : ప్రముఖ ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీదారు పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక కేంద్రం కోసం రూ.500 కోట్ల వ్యయం చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని జూలై 31న ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుందని ఆ సంస్థ తెలిపింది. ఇటలీకి చెందిన పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తున్నట్టు పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సిఎండి గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. కొత్త కేంద్రం చేరికతో సంస్థ మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని సిఇఒ పరాస్ కుమార్ జైన్ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ.400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నామన్నారు. ఇక్కడ జంబో, సూపర్ జంబో సైజులో స్లాబ్స్‌ను తయారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం వద్ద ఉన్న ఎపిసెజ్లో 2009లో కంపెనీ క్వార్జ్ సర్ఫేసెస్ తయారీ కోసం తొలి ప్లాంటును స్థాపించింది.