Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్గావ్ : తమ సంస్థతో కలిసి పని చేస్తున్న లక్ష మందికి పైగా డ్రైవర్లకు కనీసం ఒక్క డోసు కొవిడ్ వ్యాక్సిన్ వేయించినట్టు ఉబర్ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థలో లక్షా 50 వేల మందికి టీకా వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం రూ.18.5 కోట్ల మొత్తాన్ని వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రయివేటులో టీకాలు వేయించుకున్న డ్రైవర్లకు వ్యాక్సిన్ పరిహారం అందిస్తున్నట్లు పేర్కొంది.