Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రెండు నూతన ఫోల్డబల్ స్మార్ట్ఫోన్లను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ కమ్యూనికేషన్స్ హెడ్ డాక్టర్ రోహ్ తెలిపారు. జెడ్ ఫోల్డ్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు గుగూల్‌తో ఇప్పుడు శాంసంగ్ అతి సన్నిహితంగా పనిచేస్తుందని, తద్వారా ఫోల్డబల్ పర్యావరణ వ్యవస్థను అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్స్, సేవలతో సమృద్ధి చేయనున్నామన్నారు.‘‘మా మూడవ తరపు గెలాక్సీ జెడ్ ఫోన్ల కోసం, మేము మరిన్ని భాగస్వామ్య యాప్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా వైవిధ్యమైన ఫోల్డవుట్ ఫార్మాట్‌ను తీసుకురాబోతున్నాం. గుగూల్ డ్యూయోతో హ్యాండ్స్ ఫ్రీ ఆప్టిమైజ్డ్ వీడియో కాలింగ్ నుంచి యూట్యూబ్‌లో ఫ్లెక్స్ మోడ్‌లో వీడియోలను వీక్షించడం వరకూ, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో మల్టీ టాస్కింగ్ సహా మా ఫోల్డబల్ ఎకోసిస్టమ్, సౌకర్యవంతమైన మెరుగైన అనుభవాలను అందించనున్నాయి’’అని అన్నారు. శాంసంగ్ వద్ద ‘ఓపెన్’, ‘సెక్యూర్’ ఎప్పుడూ కూడా పరస్పర భిన్నమైనవి కావు. డాక్టర్ రోహ్ మాట్లాడుతూ, శాంసంగ్ ఇప్పుడు నమ్మకమైన పరిశ్రమ నాయకులైనటువంటి గుగూల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని, నేడు అత్యంత వేగంగా మారుతున్న, ఇంటర్కనెక్టడ్ ప్రపంచంలో సురక్షితమైన మరియు ఆప్టిమైజ్డ్ మొబైల్ సాంకేతికతను అందిస్తున్నామన్నారు.