Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాస్టాగ్ల జారీలో...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది తొలి 6 నెలల్లో ఒక్క కోటికి పైగా ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడిలను జారీ చేసినట్లు పేటీఎం పేమెంట్ బ్యాంక్ వెల్లడించింది. అనుమతించిన 32 బ్యాంక్లు జారీ చేసిన మొత్తం పాస్టాగ్ల్లో ఇది 30శాతం అని పేర్కొంది. టోల్ ప్లాజాలను దాటడానికి ఫాస్టాగ్ స్టిక్కర్లను దేశంలోని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ హైవేల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం కొనసాగించాలని పేటియం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఎండి, సిఇఒ సతీష్ గుప్తా పేర్కొన్నారు.