Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ బీమాతో కూడిన రెండు రకాల క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేసింది. లుమిన్ ప్లాటినం క్రెడిట్ కార్డ్, ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్‌లను ఆవిష్కరించింది. ఈ రూపే క్రెడిట్ కార్డులను తమ పాలసీదారులు, ఏజెంట్లు, సంస్థ ఉద్యోగులు, తమ అనుబంధ సంస్థల్లో పనిచేసేవారికి మాత్రమే జారీ చేయనున్నట్లు ఎల్ఐసీ వెల్లడించింది. ఈ కార్డులపై విభిన్నమైన ఆఫర్లు, బెనిఫిట్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రెడిట్ కార్డులతో పాలసీ దారుల బీమా ప్రీమియం చెల్లింపులు, రెన్యూవల్ మొత్తం చెల్లింపులపై రెండు రెట్ల రివార్డు పాయింట్లు పొందవచ్చని పేర్కొంది. ఈ కార్డులతో విమాన ప్రయాణ బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, శాశ్వత వైకల్యం, క్రెడిట్ షీల్డ్ కవర్, జీరో కార్డ్ లియబిలిటీ తదితర బీమా సౌలభ్యాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు కార్డులతో 48 రోజుల వరకు వడ్డీ లేని చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది.