Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ డాబర్ ఇండియా కొత్తగా వాటికా కలిసిన కొబ్బరి నూనెను ఆవిష్కరించినట్లు తెలిపింది. దీంతో తల నూనెల మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. వాటికా కలిసిన కొబ్బరి నూనెలో 10 మూలికల శక్తి ఉంటుందని.. దీంతో నాలుగు వారాల్లో జుట్టు రాలడం 50 శాతం వరకు తగ్గుతుందని డాబర్ ఇండియా కేశ సంరక్షణ మార్కెటింగ్ హెడ్ గౌరవ్ పరాశర్ తెలిపారు. ఇది 75 మిల్లీలీటర్ల నుంచి 450 మిల్లీలీటర్ల పరిమాణంలో నాలుగు సైజుల్లో లభిస్తుందని.. ధరల శ్రేణీ రూ.45 నుంచి రూ.259గా నిర్ణయించింది.