Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వెజ్ కెరటిన్, దానిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన మెరుగు పరిచేందుకు స్విచ్ టు వెజ్ కెరటిన్ ప్రచారం నిర్వహిస్తున్న అతుల్య బ్రాండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జుట్టు సంరక్షణ కోసం శాఖాహార కెరటిన్ ఉత్పత్తులను పరిచయం చేసింది.
విస్తృతశ్రేణిలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను పరిచయం చేయడంలో భాగంగా బీకాన్ బయో లైఫ్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్ కు చెందిన సుప్రసిద్ధ బ్రాండ్ అతుల్య తమ నూతన వెజ్ కెరటిన్, వీట్ ప్రొటీన్ శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో హెయిర్ షాంపూ, హెయిర్ కండీషనర్, హెయిర్ఆయిల్, హెయిర్ మాస్క్ ఉన్నాయి. జంతువుల కెరటిన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా కూరగాయలతో తయారుచేసిన శాఖాహార కెరటిన్‌తో రూపుదిద్దిన హెయిర్ కేర్ ఉత్పత్తి శ్రేణిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా అతుల్య పరిచయం చేసింది. ఈ నూతన ఉత్పత్తి శ్రేణితో పాటుగా స్విచ్ టు వెజ్ కెరటిన్ శీర్షికన ఓ ప్రచారం సైతం అతుల్య నిర్వహిస్తూ వెజ్ కెరటిన్ వినియోగం, దాని ప్రయోజనాలను గురించి కూడా చెబుతున్నది. అతుల్య ఈ ఉత్పత్తులన్నీ కూడా మొక్కలు, వెజ్ కెరటిన్ నుంచి తయారుచేసింది. ఈ ఉత్పత్తులన్నీ పూర్తిగా జుట్టు సంరక్షణ కోసం ఎలాంటి రసాయనాలూ వినియోగించకుండా భారతదేశంలో తయారుచేశారు. జంతువుల కెరటిన్‌తో తయారుచేసిన ఉత్పత్తుల్లా కాకుండా అతుల్య కెరటిన్, వీట్ ప్రొటీన్ శ్రేణి ఉత్పత్తులన్నీ కూడా పారాబెన్స్, సల్ఫైట్ రహితంగా ఉంటాయి.
బీకాన్ బయోలైఫ్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ సింగ్ మాట్లాడుతూ తాము జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెజ్ కెరటిన్ ఉత్పత్తులతో వచ్చామన్నారు. వెగాన్ జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ఇది ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇటీవలి కాలంలో అధికశాతం మంది క్రూరత్వం లేని, సహజసిద్ధమైన, రసాయనాలు లేని ఉత్పత్తులను కోరుకుంటున్నారని అందువల్ల, తాము ఈ ప్రత్యేక శ్రేణి ఉత్పత్తులను వెజ్ కెరటిన్‌తో తయారుచేసి అందిస్తున్నామన్నారు. జుట్టు పాడవకుండా కాపాడటంతో పాటుగా జుట్టు చిట్లకుండా అడ్డుకునే ప్రొటీన్‌ను సైతం కాపాడుతుందని చెప్పారు. వినియోగదారులకు ఈ అంశాల పట్ల అవగాహన కల్పించడానికి స్విచ్ టు వెజ్ కెరటిన్ ప్రచారమూ ఆరంభించామన్నారు. ప్రోత్సాహకరమైన స్పందనను తాము అందుకుంటున్నామని అన్నారు. ఈ ఉత్పత్తులలోని వెజ్కెరటిన్తో పాటుగా వీట్ ప్రొటీన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాంశాలు జుట్టు ఆరోగ్యం కాపాడటంతో పాటుగా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయని వివరించారు. అత్యంత అనుకూలమైన ధరలో లభించే అతుల్య కెరటిన్, వీట్ ప్రొటీన్ శ్రేణి ఉత్పత్తులు అతుల్య వెబ్సైట్ www.atulyaherbals.com, అమెజాన్ లో లభిస్తాయన్నారు.