Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన రెంటల్స్ సేవలను ఇప్పుడు 39 నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నానని ఉబర్ ప్రకటించింది. పలువురు రైడర్ల తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, వ్యాపార సమావేశాలు మరియు అధికారిక పనుల నిమిత్తం మల్టీ-హవర్, మల్టీ-స్టాప్ సేవలను ఎంపిక చేసుకుంటున్నారని ఉబర్ తెలిపింది. జూన్ 2020లో ఈ నూతన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వినియోగదారులు తమ జీవనోపాధికి, కిరాణా సరుకుల కొనుగోలు, ప్రార్థనా స్థలాల సందర్శన, ఇళ్లు మార్చడం మరియు బాడుగకు ఇళ్లను వెతుక్కునేందుకు వీటిని వినియోగించుకుంటున్నారు. వారి రోజువారీ జీవితాలను అనుకూలమైన, సరసమైన మరియు సురక్షితమైన ప్రయాణ సదుపాయాల కోసం ప్రయాణికులు వెతుకుతుండటంతో, ఉబర్ రెంటల్స్ న్యూ నార్మల్‌లో సరసమైన ప్రయాణ ఎంపికలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి మెట్రోల్లో వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా, ఈ సేవలకు ఈ నెలలో డబుల్ ట్రిప్ డిజిట్ ఉందని కంపెనీ ప్రకటించగా, ఇక్కడ సగటు ట్రిప్ వ్యవధి 2 గంటలకుపైగా ఉంది. డ్రైవర్ భాగస్వాములకు సంపాదించుకునే అవకాశాలను మెరుగు చేయడంతో పాటు, సముదాయాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా గత ఏడాది విస్తరించిన లాక్డౌన్ అనంతరం రెంటల్స్ సేవలను ఉబర్ ప్రారంభించింది.
ప్రయాణికులు తమ సొంత కారును 24x 7 స్వేచ్ఛగా వినియోగించుకున్నట్లు, పలు చోట్ల కారు నిలుపుకుని పనులు పూర్తి చేసుకు వచ్చే విధంగా, స్వేచ్ఛగా కారు మరియు డ్రైవర్‌ను బుక్ చేసుకునేందుకు ఆన్-డిమాండ్ సేవలు అనుమతిస్తాయి. ఇది వరుస పనులు చేసుకునేందుకు లేదా వ్యాపార సమావేశాలకు హాజరు అయ్యేందుకు, పలు చోట్ల ఆగుతూ చేసుకునే ప్రయాణాలకు, ప్రతిసారీ కారును బుక్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆగ్నేయ ఆసియాలో ఫ్రెష్‌వర్క్స్ అధిపతి మరియు బెంగళూరు నివాసి జానీ మాట్లాడుతూ, ‘‘ఉబర్ రెంటల్స్ నేను ఇష్టపడే రవాణా విధానం. ముఖ్యంగా నేను ఒకే రోజు పలు చోట్లకు ప్రయాణించవలసిన అవసరం ఉన్నప్పుడు, మేము మా టీకా డోసులను వేయించుకోవలసి వచ్చినప్పుడు ఈ సేవలను ఇటీవలే వినియోగించుకున్నాము. ప్రతిసారీ క్యాబ్ కోసం వేచి చూడకుండా, ఉన్న సమయంలో పలు చోట్ల ఆగుతూ, ఒకే డ్రైవరుతో 3-4 గంటలు ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా మరియు సౌఖ్యంగా అనిపించింది. ఇది కచ్చితంగా సరళమైన మరియు ఇబ్బంది లేని ప్రయాణ విధానం’’ అని వివరించారు
విజయవంతమైన ఈ సేవల గురించి ఉబర్ ఇండియా మరియు దక్షిణాసియా రైడర్ ఆపరేషన్స్ హెడ్ రతుల్ ఘోష్ మాట్లాడుతూ, ‘‘ఉబర్‌లో మారుతున్న మన సముదాయాల అవసరాలకు ఉపయోగపడే మెబిలిటీ పరిష్కరణలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మేము ప్రతిసారీ కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాము. మా రైడర్లలో చాలా మందికి ఇప్పుడు కొత్తగా సేవలను వినియోగించుకోవలసిన విభిన్న అవసరాలు ఉండగా, వీటిలో ఒకటి న్యూ నార్మల్ ప్రయాణంలో సరసమైన పలు-గంటల, మల్టీ-స్టాప్ ఎంపికలను బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సేవలను 39 నగరాలకు విస్తరించడం ద్వారా ఉబర్ రెంటల్స్‌పై మేము ఒక నెలలో స్థిరమైన వృద్ధిని చూడడంతో పాటు ఈ సేవలు రైడర్స్ అవసరాలను ఎలా తీరుస్తుందో గుర్తించాము. మా డ్రైవర్ భాగస్వాములకు, ఈ ప్లాట్‌ఫారంపై సంపాదించుకునేందుకు మరో అవకాశాన్ని అందిస్తుంది’’ అని వివరించారు. ఒక బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా సమగ్రమైన భద్రతా చర్యలు, సౌకర్యవంతమైన పిక్-అప్లు, సరసమైన ధరలు మరియు డిజిటల్ చెల్లింపు ఎంపికలతో, కొత్తగా కారును బాడుగకు తీసుకునే విభాగంలో చికాకు రహిత, ఉన్నత అనుభవాన్ని ప్రయాణికులకు అందించాలని ఉబర్ భావిస్తోంది. ఈ నూతన సేవలను రైడర్లు మరియు డ్రైవరు భాగస్వాములు ఇద్దరూ ఆస్వాదించేలా ఉన్నాయి. దేశంలోని 39 నగరాలు ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, పూణె, అహ్మదాబాద్, పాట్నా, చండీగఢ్, కాన్పూర్, లక్నో, కొచ్చి, జైపూర్, గువహతి, భోపాల్, నాగ్‌పూర్, ఇండోర్, విశాఖపట్నం, భువనేశ్వర్, లూధియానా, రాంచీ, కోయంబత్తూర్, తిరుపతి, ఉదయపూర్, జోధ్‌పూర్, వారణాసి, ఆగ్రా, అమృత్సర్, తిరువనంతపురం, రాయపూర్, డెహ్రాడూన్, సూరత్, అజ్మీర్, విజయవాడ, వడోదర, నాసిక్, జబల్పూర్లలో ఉబెర్ రెంటల్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి.