Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సహజ సిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థ మైగ్లామ్ కొత్త ప్రాడక్టును లాంచ్ చేసింది. మై గ్లామ్ బ్రాండ్ అంబాసిడర్ మరియు భాగస్వామి అయిన బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తమ మొట్టమొదటి జాతీయ టీవీసీని ‘మీరు ఏం కోరుకుంటున్నారో మై గ్లామ్ కు చెప్పండి (టెల్ మైగ్లామ్ వాట్ యు వాంట్)’ ట్యాగ్ లైన్ తో విడుదల చేసింది. వినూత్నంగా నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో మైగ్లామ్ బ్రాండ్ అంబాసిడర్ మరియు ఇన్వెస్టర్ శ్రద్ధాకపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎన్నో ఏళ్లుగా మహిళలు కంటున్న తమ అందమైన కలలు, కోరికలను పంచుకునే వేదికగా నిలిచేందుకు మైగ్లామ్ ముందుకు సాగుతోంది. తమకు ఏమి కావాలో బ్రాండ్‌కు తెలిపే సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ద్వారా సౌందర్య ప్రపంచంలో సరికొత్త విప్లవాత్మక చర్యలకు మైగ్లామ్ శ్రీకారం చుట్టింది. దేశంలోని మహిళలు తమ సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే అనుభవాలు పూర్తిగా మారిపోతాయని మై గ్లామ్ భావిస్తోంది. ఈ సందర్భంగా మైగ్లామ్ సీఈఓ అప్రితమ్ మజుందార్ మాట్లాడుతూ వినూత్న తరహా ప్రయోగం పట్ల తనతోపాటు అందరూ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను మరింత మంది ప్రజల చెంతకు తీసుకువెళ్లే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచంలో మావంతు స్ఫూర్తిని కలిగిస్తున్నామని అన్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ మైగ్లామ్ యొక్క మొట్టమొదటి టీవీసీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలు కోరుకుంటున్న ఉత్పత్తులను సృష్టించడంలో నేను ప్రతిబింబించే అవకాశం కలిగిందన్నారు. మైగ్లామ్ ద్వారా నా అభిమానుల సౌందర్య అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.