Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమ సరికొత్త డిజిటల్ వేదిక ‘ఏబీపీ దేశం’ ను ప్రారంభించనట్టు ఏబీపీ నెట్వర్క్ వెల్లడించింది. ప్రజలకు ముఖ్యమైన అంశాలతో కూడిన కధనాలు అందించడంతో పాటుగా ప్రాంతీయ అంశాల పట్ల ప్రత్యేక దృక్పథంతో తెలుగు డిజిటల్ వార్తా ప్రపంచంలో నూతన ఒరవడిని ఏబీపీ దేశం తీసుకురానుంది. నిష్పాక్షికమైన, విశ్వసనీయమైన వార్తలతో ప్రేక్షకుల నమ్మకాన్ని చోరగోంటామని ప్రకటించింది. ఈ నూతన ఆఫరింగ్తో, ఏబీపీ నెట్వర్క్ను మరోమారు తమ స్ధానిక స్టోరీటెల్లింగ్ కోసం బలోపేతం చేయడంతో పాటుగా ప్రాంతీయ వార్తా ప్రపంచంలో పురోగతిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. గత త్రైమాసంలో, ఈ నెట్వర్క్ తమిళనాడు మార్కెట్లోకి తమ డిజిటల్ ప్లాట్ఫామ్, ఏబీపీ నాడుతో ప్రవేశించింది. తెలుగు ప్రజల సంస్కృతి, నైతికత, స్ఫూర్తిని పూర్తిగా ప్రతిబింబించే డిజిటల్ మాధ్యమంగా ఏబీపీ దేశం తమను తాము నిలుపుకుంటుంది.