Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేవలం కొన్ని సెకన్లలోనే PhonePe వినియోగదారులు మ్యూచువల్ ఫండ్ SIPలను సెటప్ చేసుకోవడాన్ని అనుమతించే విధంగా మ్యుచువల్ ఫండ్ పెట్టుబడి ఎంపికల కోసం UPI ఆధారిత ఆటోపే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టినట్లు భారతదేశపు అతిపెద్ద డిజిటల్ పేమెంట్ల సంస్థ PhonePe ప్రకటించింది. తద్వారా దేశంలోనే ఈ ఫీచర్‌ను పరిచయం చేసిన మొట్టమొదటి డిజిటల్ పెట్టుబడుల వేదికగా PhonePe నిలిచింది.
UPI ఆటోపే ద్వారా, PhonePe వినియోగదారులు కేవలం 3 దశల్లోనే తమ SIPలను సెటప్ చేసుకోవచ్చు: ఫండ్ ఎంచుకుని, నెలవారీ SIP పెట్టుబడి మొత్తాన్ని ప్రవేశపెట్టి, UPI పిన్ను ప్రామాణీకరిస్తే చాలు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని ఇస్తుంది. PhonePe తమకు నచ్చిన పెట్టుబడి పోర్ట్ ఫోలియోను నిర్మించడంలో వినియోగదారుల అవసరాలను తీరుస్తూనే వారికి మెరుగైన అనుభవాన్ని అందించే చర్యలపైన PhonePe దృష్టి పెడుతోంది. PhonePe యాప్‌లో ఇది వరకే ఉన్న పెట్టుబడిదారులు మరియు కొత్త పెట్టుబడిదారులకు UPI ఆటోపే ఆప్షన్ ద్వారా SIP అందుబాటులో ఉంది.
PhonePeలో పెట్టుబడుల కోసం UPI ఆటోపేని సెట్అప్ చేసే విధానం:
PhonePe యాప్ హోమ్ పేజీలోని పెట్టుబడి విభాగంలో ‘SIPను ప్రారంభించు’ ఐకాన్‌పై క్లిక్ చేయండి. మీ పెట్టుబడి శైలి (కన్సర్వేటివ్/మోడరేట్/అగ్రెసివ్) మరియు పెట్టుబడి కాల పరిమితిని (స్వల్ప/మధ్యస్థ/దీర్ఘకాలిక) ఎంచుకోండి. ఫండ్‌ను ఎంచుకుని నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని ప్రవేశపెట్టండి. రెగ్యులర్ పెట్టుబడులను సెట్అప్ చేయడానికి మీ UPI పిన్ను ప్రవేశపెట్టండి. PhonePeలో అందుబాటులో ఉన్న ఏదైనా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఆప్షన్ల ద్వారా వినియోగదారులు నెలవారీ SIPలను ఎంచుకున్నప్పుడు UPI ఆటోపే ఫీచర్‌ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.