Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగష్టు 5 నుండి 9 వరకూ
హైదరాబాద్: అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తీసుకుస్తున్న ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ నుండి అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగష్టు 5 నుండి 9 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను ఎస్బీఐ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. కాబట్టి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలుచేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ తరువాత వస్తున్న ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఆన్లైన్ రిటైలర్ ఆఫర్స్, డిస్కౌంట్ లతో స్మార్ట్ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ అందిస్తుంది. టీవీలు వాషింగ్ మెషీన్స్ వంటి అప్లయన్సెస్ పైన గరిష్టంగా 55% వరకూ భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. అంటే, ఈ అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ టీవీ లేదా వాషింగ్ మెషిన్ ను కేవలం సగం ధరకే పొందేవీలుంటుంది. No cost EMI, ఎక్స్చేంజ్ అఫర్, కావాల్సిన సమయానికి ప్రోడక్ట్స్ ని ఇంటి వద్ద అందుకునే విధంగా షెడ్యూల్డ్ డెలివరీ అవకాశం కూడా వుంది.