Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా.మోహన్, నవీన్ చంద్ర, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం '1997'. డా. మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం దస్పల్లా హౌటల్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై, సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, '1997 సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకత్వం, నిర్మాణం, నటన.. ఇలా అన్ని పనులు చేయడం చాలా కష్టం. అయినప్పటికీ మోహన్ గారు మొదటిసారే ఇవన్నీ చేశారంటే చాలా గ్రేట్. ఈ సినిమా మంచి విజయం సాధించి, మోహన్‌గారు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'ఈ కథ చాలా బాగా నచ్చింది. హీరోనా, చిన్న పాత్ర అనేది కాకుండా ఓ మంచి పాత్ర చేశాననే తప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు. అలాగే నటుడిగానూ అద్భుతంగా నటించారు' అని హీరో నవీన్ చంద్ర చెప్పారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, 'మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. ఇందులో ఆయన నాకు కొడుకుగా నటించారు. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి' అని తెలిపారు. 'ఓ బర్నింగ్ ఇష్యూని తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు' అని డా|| మోహన్ చెప్పారు.