Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా మిని ఇపె బాధ్యతలు స్వీకరించారు. ఆమెను ఈ హోదాలో ఎంపిక చేస్తూ జులై 5న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన మిని 1986లో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా ఎల్ఐసీలో కేరీర్‌ను ప్రారంభించారు. వివిధ హోదాల్లో పని చేసిన విశేష అనుభవం ఆమెకు ఉంది. హైదరాబాద్ జోనల్ మేనేజర్‌గా పని చేసిన తొలి మహిళ కూడా ఆమెనే. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్‌కు డైరెక్టర్, సిఇఒగా పని చేసిన అనుభవం ఉంది. ఈ సంస్థను ఆదాయం, లాభాల్లోనూ నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆమె ప్రత్యేక కృషి చేశారు.