Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమార్ మంగళం బిర్లా
న్యూఢిల్లీ : భారీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎ ల్)లోని తన వాటాలను కేంద్ర ప్రభుత్వా నికి వదులుకునేం దుకు సిద్ధంగా ఉన్నానని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మెన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. వీఐఎల్లోని తనకున్న 27 శాతం వాటాను ఏదేని ప్రభుత్వ యాజమాన్యంలోని, లేదంటే దేశీయ ఆర్థిక సంస్థకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు జులై 7న ఆయన లేఖ రాశారు. వీఐఎల్ నిధుల సేకరణకు ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి లభించలేదు. దీంతో ఈ సంస్థ అప్పులు, బకాయిలు చెల్లించలేని పరిస్థితి చోటుచేసుకుంది. వీఐఎల్‌లో బిర్లాకు 27శాతం, బ్రిటన్ వొడాఫోన్ పీఐసీకి 44శాతం చొప్పున వాటాలున్నాయి. వొడాఫోన్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలూజేషన్ దాదాపు రూ.24 వేల కోట్లు. ఇందులో బిర్లా వాటా 27శాతం లేదా రూ. 6,480 కోట్లుగా ఉంటుంది. ఆర్థిక ఒత్తిడిలో వీఐఎల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జర్మనీ కేంద్రంగా పని చేస్తోన్న బహుళజాతి విత్త సేవల సంస్థ డచీ బ్యాంక్ ఇటీవల ఓ పరిశోధన రిపోర్ట్‌లో సూచించింది. ఏజీఆర్ బకాయిల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, స్పెక్ట్రమ్ అప్పులు, ప్రస్తుతం 5జీ స్పెక్ట్రం అవసరాల నేపథ్యంలో వీఐని ప్రభుత్వపరం చేసుకోవడం మాత్రమే పరిష్కారమని పేర్కొంది. కాగా.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పా ఈ సంస్థకు మూలధన కల్పనకు అవకాశం లేదని డచీ బ్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్ పీటర్ మిలికెన్ పేర్కొన్నారు.