Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దీని ఆధునిక యానిమేషన్ శైలి, శక్తివంతమైన సమకాలీన కథనానికి చక్కని ప్రశంసలు అందుకోగా, శరద్ దేవరాజన్, జీవన్ జె.కాంగ్, చారువి పి. సింఘాల్ నేతృత్వంలో గ్రాఫిక్ ఇండియా నిర్మించిన ఈ పౌరాణిక యానిమేషన్ సిరీస్ సీజన్ 2లో అద్భుతమైన దృశ్య అనుభవాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. ప్రముఖ రచయితలు శరద్ దేవరాజన్, సర్వత్ చడ్ఢా, అశ్విన్ పాండే, అర్షద్ సయ్యద్ ప్రధాన కథను అందించగా, జీవన్ కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. మహాబలి హనుమంతుని ప్రయాణాన్ని పిల్లలతో పాటు పెద్దలూ ఆస్వాదించేలా తాజా సీజన్ రాబోతుంది. 13 ఎపిసోడ్స్ గల ఈ షో దేశంలోని 7 భాషలు- హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. డిస్నీ +హాట్స్టార్లో ఆగస్టు6న ప్రత్యేకంగా విడుదల కానుంది.