Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లాంగ్‌టైల్ ఉత్పత్తుల విభాగంలో భారతదేశపు అతి పెద్ద ఆన్లైన్ మార్కెట్‌గా గుర్తింపు దక్కించుకున్న మీషో, విక్రేతలు అందరికీ 0% కమిషన్ ఆఫర్‌ను అందబాటులోకి తీసుకువచ్చిన దేశంలోని మొదటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారంగా నిలచింది. దేశంలోని 100 మిలియన్ల చిన్న వ్యాపారాలను ఆన్లైన్లో విజయవంతం చేయాలన్న దృష్టికోణానికి అనుగుణంగా, మీషో ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న విక్రయదారులకు ఇ-కామర్స్ అనుభవాన్ని సజావుగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కమిషన్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా వారి మూలధనాన్ని మరింత సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెట్టాలని కోరుకునే వ్యాపారులను ఇది ప్రోత్సహిస్తుంది. దేశంలో రానున్న పండుగ సీజన్ నాటికి వ్యాపారాలు పుంజుకుంటున్న వేళ, సరైన సమయంలో ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది.
ఈ ఆఫర్‌ను ప్రకటించిన మీషో సహ-వ్యవస్థాపకుడు & ముఖ్య కార్యనిర్వహణ అధికారి విదిత్ ఆత్రే మాట్లాడుతూ ‘‘దేశంలోని 100 మిలియన్ల చిన్న మరియు మధ్యతరహా వ్యాపార సంస్థలను మీషో ద్వారా డిజిటల్ వేదికపైకి తీసుకు రావాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాము. ఇది విక్రేతల పట్ల మాకున్న నిబద్ధతకు అద్దంపడుతుంది మరియు వారి వ్యాపార అభివృద్ధి ప్రయాణంలో అండగా నిలుస్తుంది. మా విక్రేతల కోసం సున్నా శాతం కమిషన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన దేశంలో మొట్టమొదటి ఇ-కామర్స్ సంస్థగా మేము అవతరించాము. వ్యాపారాన్ని నిర్వహించేవారు ఆఫ్‌లైన్ నుంచి ఆన్ లైన్‌కు వెళ్లేటప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాకున్న అవగాహనతో, వారి ఉత్పత్తులు అన్నింటినీ చిత్రాలతో ప్రదర్శించుకునే సౌలభ్యాన్ని అందించే వేదికను రూపొందించేందుకు మాకు అవకాశం దక్కింది. మీషో ప్రకటించిన 0% కమిషన్ డిజిటల్ వేదికకు మారడం ఎంత సులభంగా మరియు సమర్థవంతంగా ఉంటుందో తెలుసుకునేందుకు విక్రేతలకు ఎంతో సహకరిస్తుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటి నుంచి, మీషో ప్లాట్‌ఫారమ్‌లో చేరిన విక్రేతలు మరియు తయారీదారుల సంఖ్య 25% వృద్ధి చెందింది. ఇటీవల మీషోలో చేరిన అహ్మదాబాద్‌కు చెందిన విక్రేత కమల్ రతి మాట్లాడుతూ ‘‘నేను మీషోలో చేరాలని తీసుకున్న నిర్ణయం నాకు సంతోషాన్ని ఇస్తోంది. ఇది నా వ్యాపారాన్ని డిజిటల్ వేదికపైకి తీసుకు వెళ్లేందుకు సహాయపడింది. మీషో ప్రకటించిన 0% కమిషన్ ప్రోగామ్ మరియు నా ఉత్పత్తులను గురించి ఎక్కువ మంది తెలుసుకునేందుకు చిత్రాలతో సహా విస్తృతంగా అందించినందుకు- 100% లాభాన్ని నేనే అందుకునేలా చేసినందుకు ధన్యవాదాలు. ఇది నా వ్యాపారానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నా సంపాదనను మరింత పెంచుకోవాలని ఆశిస్తూ, రానున్న పండుగ సీజన్ నుంచి సీజన్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు.
భారతదేశంలో సుమారు 6.3 కోట్ల సూక్ష్మ, చిన్న & మధ్య తరహా వ్యాపార సంస్థలు (MSMEs) ఉండగా, వాటిలో కేవలం 10 లక్షల ఎంఎస్ఎంఇలు మాత్రమే తమ వ్యాపారాలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నాయి. వ్యాపారులకు మీషో అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలతో, ఈ చిన్న వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి సులభంగా తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మీషో ప్రస్తుతం లాజిస్టిక్స్, చెల్లింపులు, కస్టమర్ కేర్, ఆన్లైన్ కేటలాగ్లను రూపొందించేందుకు సమర్థవంతమైన సాధనాలు మరియు డిమాండ్ ఉన్న వాటిపై డేటా-ఆధారిత వ్యాపార దృష్టికోణంతో విక్రేతలకు సహాయం చేస్తుండగా, దీనితో వారు తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. తాజాగా ప్రకటించిన 0% కమిషన్‌తో, ఈ లాభదాయకమైన మార్పును అనుసరించేందుకు, మీషోలో 700+ కేటగిరీల్లో తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించుకునేందుకు అవకాశం కలుగుతుంది.
మీషో ప్రకటించిన 0% కమిషన్ ప్రోత్సాహానికి అనుగుణంగా, చిన్న-మధ్య తరహా వ్యాపారాలను నిర్వహించే వారికి అవగాహన కల్పించేందుకు ‘మీషో పే కమిషన్ హై జీరో, అబ్ బిజినెస్ ఆప్కా బనేగా హీరో’ అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆన్ లైన్లో వ్యాపారాన్ని తీసుకు వచ్చేందుకు మరియు మీషో 0% కమిషన్ ప్రోగ్రాం ద్వారా విక్రేతలు చక్కని ప్రయోజనాలను పొందేందుకు ఇంత కన్నా మంచి సమయం లేదని, దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు సంస్థ హామీ ఇస్తోంది.
ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ వాణిజ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, చిన్న వ్యాపారాలను ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కు మారేందుకు నిరంతరం సౌకర్యాలు కల్పించడం మీషో లక్ష్యాలుగా ఉన్నాయి. కొనసాగుతున్న క్యాంపెయిన్‌తో, మీషో ఈ దిశలో గణనీయమై పురోగతిని సాధించింది. మీషో ఇప్పటికే 1లక్ష+ రిజిస్ట్రర్డు విక్రేతల నుంచి 4,800 పైచిలుకు నగరాల పరిధిలో 26,000 పిన్కోడ్లకు విజయవంతంగా ఆర్డర్లను పంపిణీ చేసి, ఈ విక్రేతలకు వాస్తవ వృద్ధి సామర్థ్యాలను తెలియజేసింది.