Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· బెంగుళూరులో జిఇ నేతృత్వంలోని జాన్ ఎఫ్ వెల్చ్ టెక్నాలజీ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధిపరచిన టెలి-ఐసియు పరిష్కరణ 800 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను (ICU) రిమోట్‌గా పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్నారు.
· ఇది జార్ఖండ్, అస్సాం, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఐసియు పడకలను రిమోట్‌గా పర్యవేక్షించేందుకు వైద్యులు మరియు వైద్య నిపుణులకు సహకారాన్ని అందిస్తోంది.
· ఢిల్లీలోని సైమన్ హెల్త్‌కేర్‌లోని సెంట్రల్ ఐసియుకి రిమోట్‌గా అనుసంధానం చేయడం ద్వారా ఢిల్లీలో 60 ఇళ్లలో బ్యాండ్లు ధరించిన రోగులను పర్యవేక్షించేందుకు వీలు కలిగింది.
· మెట్రో కేంద్రాల నుంచి మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులను అనుసంధానం చేసేందుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు నమ్మదగిన డిజిటల్ పరిష్కారం.
హైదరాబాద్: భారతీయ ఆరోగ్య రంగంలో ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. కొవిడ్-19కు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేసిన సమయంలో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ ప్రదేశాలు లేదా ఒక భవనం లోపల కేంద్రీకృత క్షేత్రాల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను (ICUs) అనుసంధానం చేసేందుకు అనువుగా విప్రో జిఇ హెల్త్‌కేర్ రిమోట్ మానిటరింగ్ సొల్యూషన్, టెలి-ఐసియు, సెంట్రిసిటీ హై అక్విటీ క్రిటికల్ కేర్ సొల్యూషన్ (CHA-CC) లను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికత ఇప్పటివరకు భారతదేశంలోని పలు ఆసుపత్రులలో 800 పడకలను హబ్ ఆసుపత్రికి అనుసంధానం చేసి, అక్కడ అత్యంత నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు రోగుల తీవ్ర అనారోగ్య సమస్యలకు అధునాతన విధానంలో కన్సల్టేషన్ మరియు సంరక్షణను అందిస్తూ వస్తోంది. ఈ పరిష్కరణను జారీలోకి తీసుకు వచ్చిన ఆసుపత్రులలో అపోలో హాస్పిటల్స్-హైదరాబాద్, కైనోస్ హాస్పిటల్-రోహ్తక్, అపెక్స్ హాస్పిటల్-జైపూర్ ఉన్నాయి. ప్రస్తుతం, జార్ఖండ్, అస్సాం, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఐసియు పడకలు ఈ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి.
బెంగుళూరులోని జిఇకు చెందిన జాన్ ఎఫ్ వెల్చ్ టెక్నాలజీ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేసిన టెలి-ఐసియు వ్యవస్థ హబ్ అండ్ స్పోక్ మోడల్‌పై పనిచేస్తుంది. ఇక్కడ క్లినిషియన్లు వ్యక్తిగతంగా హాజరు కాకుండానే- ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో రోగుల క్లిష్టమైన అనారోగ్య సమస్యలకు ఉన్నత స్థాయిలో అధునాతన కన్సల్టేషన్లు, సంరక్షణ అందించేందుకు వీలు కల్పిస్తుంది. జైపూర్ అపెక్స్ హాస్పిటల్ చీఫ్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ శైలేష్ జవార్ మాట్లాడుతూ, ‘‘విప్రో జిఇ హెల్త్‌కేర్ అందుబాటులోకి తీసుకు వచ్చిన టెలి-ఐసియు సొల్యూషన్ మరింత ఎక్కువ మంది రోగులకు చికిత్స, కన్సల్టేషన్లతో హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ సామర్థ్యాన్ని గణనీయంగా వృద్ధి చేసింది. రోజుకు కేవలం 15 మంది రోగుల నుంచి, ఇప్పుడు నేను 80-100 మంది రోగులను పర్యవేక్షించేందుకు అవకాశం కలిగింది. దీనితో పాటు మేము అందిస్తున్న సంరక్షణను కనీసం నాలుగు రెట్లు పెంచుతుంది’’ అని తెలిపారు. ఆరు నెలల పాటు వర్చ్యువల్ కేర్ సొల్యూషన్‌ను వినియోగించిన తరువాత, డాక్టర్ జవార్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న రోగుల క్లినికల్ ఫలితాలను కూడా మెరుగుపడినట్లు గమనించారు. అదనంగా, మీడియోటెక్ భాగస్వామ్యంతో విప్రో జిఇ హెల్త్‌కేర్ (CHA-CC మరియు ధరించగలిగే మెడ్‌టెక్ బ్యాండ్లను ఉపయోగించి రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం) ఢిల్లీలోని సైమన్ హెల్త్‌కేర్‌లోని సెంట్రల్ ఐసియుకి అనుసంధానం చేస్తూ 60 హోమ్ బెడ్లకు సేవలను ప్రారంభించింది.
‘‘మహమ్మారితో ఎదుర్కొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు ఆవిష్కరణల అవసరాన్ని వేగవంతం చేసింది. మా ఇంజనీర్లు ఈ అవసరాన్ని అర్థం చేసుకొని, దాని కోసం ఒక పరిష్కారాన్ని రూపొందించారు. టెలి-ఐసియు అనేది విప్రో జిఇ హెల్త్‌కేర్ ప్రతిస్పందనలో భాగం కాగా, ఈ సదుపాయం అత్యవసర సందర్భాల్లో హెల్త్‌కేర్ నిపుణులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సేవలు అందించడంతో తోడ్పాటు అందిస్తుంది. ఈ ఐసియు సంరక్షణ పరిష్కరణ గ్రామీణ భారతదేశానికి అందుబాటులో ఉండేలా చేస్తుంది మరియు అత్యవసర వైద్య చికిత్సలు అందించవలసిన సందర్భాల్లో చేసే ప్రయత్నాలను ఏకీకృతం చేస్తుంది. ఐసియుల్లోని రోగులను ఒకే హాస్పిటల్ బిల్డింగ్‌లో లేదా అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, చికిత్స, సంరక్షణ, కన్సల్టేషన్లు ఇచ్చేందుకు ఇదొక ఉత్తమమైన మార్గం’’ అని విప్రో జిఇ హెల్త్‌కేర్, దక్షిణాసియా లైఫ్ కేర్ & ఎల్‌సిఎస్ డిజిటల్ సొల్యూషన్స్ విభాగాధిపతి అమిత్ మోహన్ తెలిపారు.