Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విక్రేతలందరికీ సున్నా కమిషన్ ఆఫర్ను అందిస్తున్నట్లు ఇ-కామర్స్ సంస్థ మీషో తెలిపింది. దేశంలోని 10 కోట్ల చిన్న వ్యాపారాలను ఆన్లైన్లో విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మీషో వేదికలో ఉన్న విక్రయదారులకు ఇ-కామర్స్ అనుభవాన్ని సజావుగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. కమిషన్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా వారి మూలధనాన్ని మరింత సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడంపై దష్టి పెట్టాలని కోరుకునే వ్యాపారులను ప్రోత్సహించనున్నట్లు తెలిపింది.