Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్‌టైం రికార్డ్‌కు చేరిక
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో నూతన గరిష్టా లను నమోదు చేస్తున్నాయి. జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.6,504 కోట్ల లాభాలను ప్రకటించడంతో బుధవారం సెషన్లో మార్కెట్లకు మరింత జోష్ లభించింది. వరుసగా మూడో సెషన్లోనూ సూచీలు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, విత్త సూచీల మద్దతుతో బిఎస్ఇ సెన్సెక్స్ తొలిసారి 54వేల పాయింట్ల మార్క్‌కు చేరింది. బిఎస్ఇ సెన్సెక్స్ 546 పాయింట్లు లేదా 1.02 శాతం రాణించి 54,370కి చేరింది. నిఫ్టీ 128 పాయింట్లు లేదా 0.79 శాతం లాభపడి 16,258 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి, కొటాక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4.77 శాతం మేర పెరిగాయి. మరోవైపు టైటన్, నెస్ల్టే ఇండియా, అల్ట్రా సిమెంట్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్ సూచీలు అత్యధికంగా 2.14 శాతం మేర నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
వొడాఫోన్ ఐడియా విలవిల..
వొడాఫోన్ ఐడియా (విఐ) షేర్లు రెండు రోజుల్లో 26 శాతం క్షీణించాయి. ఈ సంస్థలో ఇకపై పెట్టుబడులకు ఆసక్తి లేమని వొడాఫోన్ గ్రూపు, కుమార మంగళం బిర్లా ప్రకటించడంతో ఆ షేరు వేగంగా పడిపోతుంది. బుధవారం బీఎస్ఈలో 18.5 శాతం క్షీణించి రూ.6.03కి పడిపోయింది. 2020 జూన్ తర్వాత ఇతే అత్యల్ప స్థాయి. 2019 నవంబర్‌లో ఈ సూచీ ఏకంగా రూ.2.61 శాతానికి పడిపోయింది.